హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన

ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు

కర్నూలు: ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు వేదికైంది.  తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో నిర్మించనున్న పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఒకే యూనిట్‌లో సోలార్, విండ్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరగనుంది. దీని ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. పవర్‌ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 23 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఈ ప్లాంట్‌ను నెలకొల్పొతుంది. 

Back to Top