టీడీపీ స‌భకు క్షమాప‌ణ చెప్పాలి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

అమ‌రావ‌తి: స‌భ‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ స‌భ్యులు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేత‌ల మాదిరిగా మోసం, అబద్ధాలు మాకు తెలియ‌వ‌ని, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన వాగ్ధానాలు నెర‌వేర్చుతున్నామ‌న్నారు. మా మాట‌లు న‌మ్మి ప్రజ‌లు ఓట్లు వేశార‌ని, ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తూ..రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం  ఇస్తుంటే టీడీపీ ఓర్వలేక పోతోంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్ష నేత మరొకరు ఉండ‌ర‌న్నారు.

దేశ చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకుంటున్న దిక్కుమాలిన పార్టీ దేశంలో టీడీపీ తప్ప మరొకటి ఉండదు. ఉద్యోగాలు లేక మన పిల్లలు అల్లాడిపోతున్నారు. వారి జీవితాలు బాగు పరిచేందుకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తుంటే దీన్ని కూడా అడ్డుకుంటారా? ఇంతకంటే అధ్వానమైన, దిక్కుమాలిన ప్రతిపక్షం మరెక్కడా ఉండదు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెడుతుంటే ఈ ప్రతిపక్షం అడ్డం పడుతోంది. ఇలాంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొకటి లేద‌ని విమ‌ర్శించారు. 

తాజా ఫోటోలు

Back to Top