ఎట్ హోం కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌,మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు.గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయిగా వస్తోంది.


 

Back to Top