ఎస్సీ, ఎస్టీ బిల్లును అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర 

 అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకొస్తే కౌన్సిల్లో పాస్ కాకుండా అడ్డుకున్న దిక్కుమాలిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, ఆ పార్టీ నాయకులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది. అదే బిల్లును మళ్లీ ఈరోజు అసెంబ్లీలో పాస్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవాలని కుఠిల యత్నాలు చేస్తున్నారు. పోడియం దగ్గరకొచ్చి ఎందుకు జైజై అమరావతి అంటున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మాల, మాదిగ, రెల్లి కులస్తులకు వేర్వేరుగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఇన్నాళ్లు ఎస్సీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. వారిలో ఐక్యత లేకుండా చేయాలని చూసిన చంద్రబాబు ప్రయత్నాలను రిపేర్ చేస్తున్నాం. ఎస్సీలు తృణీకరించిన పార్టీ టీడీపీ. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క సభ్యుడు విజయం సాధించి ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు. అయినా వీరికి అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఇద్దరు ఎస్సీలను నియమించాం. ఆ మంత్రులందరూ కీలకమైన మంత్రి పదవుల్లో కొనసాగడం మా ప్రభుత్వ ఘనత అని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది.

Back to Top