గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతు భరోసా కేంద్రం ముఖ్య పాత్ర 

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  
 

అసెంబ్లీ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతు భరోసా కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై సీఎం ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..
ఆర్‌బీకే అంటే రైతు భరోసా కేంద్రం. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటేరియట్ పక్కనే రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. రైతుభరోసా కేంద్రాలతో పాటు వ్యవసాయానికి, రైతన్నలకోసం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి కూడా వివరించారు -
ఈ ఫిబ్రవరి 20 నాటికి 3300 రైతు భరోసా కేంద్రాలు ఆపరేషన్లోకి వస్తాయి. మార్చి నాటికి 5,500, ఏప్రిల్ నాటికి 7,300 కేంద్రాలు, రాబోయే ఖరీఫ్‌ నాటికి 11,158 కేంద్రాలు పూర్తిగా ఆపరేషన్ లోకి వస్తాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతు భరోసా కేంద్రం ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో రైతులకు కావాల్సిన ప్రతి అవసరమూ అదే గ్రామంలో రైతుభరోసా కేంద్రం ద్వారా పరిష్కారం అవుతుంది.  గ్రామ సచివాలయాల్లో రిక్రూట్ అయిన అగ్రి కల్చర్, హార్టీకల్చర్, సెబీకల్చర్ అసిస్టెంట్లు ఇక్కడ అందుబాటులో ఉంటారు. యానిమల్ హజ్బెండరీకి సంబంధించి వెటర్నరీ అసిస్టెంట్లు, డాక్టర్లు ఆర్‌బీకే ద్వారా రైతులకు సేవలందిస్తారు. రెవెన్యూ పర్సన్ కూడా సచివాలయంలోనే ఉంటాడు కనుక రైతు భరోసా కేంద్రాన్ని తరుచు సందర్శించడం జరుగుతుంది. గ్రామస్థాయి బ్యాంకు కరస్పాండెంట్ కూడా  ఆర్‌బీకేలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తాం. రైతుభరోసా కేంద్రాలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా, అగ్రికల్చర్ వర్క్‌షాప్ ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై, సహజ వ్యవసాయ పద్ధతులపై  రైతులకు అవగాహన కల్పిస్తాయి.  రైతుభరోసా కేంద్రంలో రైతుల సందేహాల నివృత్తి కోసం నిపుణులు అందుబాటులో ఉంచుతూ, కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి వాటిని రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తున్నాం. వీడియో స్క్రీనింగ్ ద్వారా కూడా రైతులు నిపుణులను సంప్రదించే వీలుంటుంది.
నాణ్యతలేని విత్తనాలు కొని, ఎరువులు వాడి చివరకు పంట నష్టపోయి రైతులు కష్టాలు పడటం ఇన్నాళ్లూ చూసాం. ఎవరు అమ్ముతున్నారో, వాటి నాణ్యత ఏమిటో తెలియకుండా ఎంతో ఖర్చుతో కొని, ఉపయోగించి రైతులు నష్టపోతున్నారు. నష్టపోయేదాకా రైతుకు వాటి నాణ్యత గురించి తెలియదు. కనుకే గవర్నమెంట్ స్టాంప్ వేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఫిష్, ఆక్వాకు సంబంధించిన నాణ్యమైన ఫీడ్ కూడా రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తుంది.
రైతు భరోసా కేంద్రాల్లో పశువులకు హెల్త్ కార్డులు, క్రాప్ ఇన్సూరెన్సు ప్రభుత్వ స్కీములు, కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన కల్పించడం, సాయిల్ టెస్టు, సీడ్ టెస్టింగ్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. బహిరంగ మార్కెట్లో రైతు కొనుగోలు చేసుకోవాలనుకున్న ఇతర విత్తనాల నాణ్యతను కూడా RBKలో అప్పటికప్పుడే టెస్ట్ చేయించుకోవచ్చు. పాడి, ధాన్యం రైతులకు మేలు చేయడం కోసం మాయిశ్చర్ మీటర్లను కూడా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచబోతున్నాం.
రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసాం. రైతులు పంట వేసేటప్పుడే అన్ని రకాల పంటలకు ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరల పట్టికను పేపర్లో ప్రకటనగా అందిస్తున్నాం. ఇంతకంటే తక్కువకు రైతు తన పంటను తెగనమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా మద్దతు ధరకంటే తక్కువకు కొనాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చొరవ తీసుకుని, మద్దతు ధరకు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేస్తుంది. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎంత, ఆ పంట ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, వాటినెప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అన్ని వివరాలను పత్రికా ప్రకటనలో పొందుపరుస్తున్నాం.
రాబోయే రోజుల్లో రైతుభరోసా కేంద్రాలే రైతుల నుంచి పంట కొనుగోలు కూడా చేస్తాయి. దళారీల చేతుల్లో చిక్కుకుని, ఐనకాడికి పంటను తెగనమ్ముకోవాల్సిన ఖర్మ ఇకపై ఉండదు. విత్తనాల పంపిణీని కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఈ క్రాప్, ఈ క్రాప్ పై అవగాహన, ఈ క్రాప్ నమోదులు చేయించడం, గ్రామంలో ఏ పంట వేయడం లాభదాయకమో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల పరిస్థితి, ఏ పంటలు అధికంగా సాగు అవుతున్నాయి, ఏ పంటలకు గిట్టుబాటు ఉంటుందో అనే అంశాలను కూడా రైతుభరోసా కేంద్రం రైతులకు సమాచారంతో పాటు సలహాను అందిస్తుంది.  
రాజీ పడకుండా రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటున్నాం. ఈ సంవత్సరమే రైతులకు వైయస్సార్ వడ్డీ లేని రుణాలు పథకాన్ని ప్రవేశ పెట్టాం. ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా ఉన్నా, గత ప్రభుత్వం పోతూ పోతూ విపరీతమైన బకాయిలు పెట్టిపోయినా, సమస్యలున్నాయి కనుక, మేమిచ్చిన మాటలో వెనకడుగు వేస్తున్నాం అని దేవుడి దయ వల్ల ఏరోజూ కూడా చెప్పలేదు.
మేనిఫెస్టో ప్రకారం రైతు భరోసా కార్యక్రమం తొలి ఏడాది లేదు. ఏడాదికి 12500 చొప్పున నాలుగేళ్లలో 50,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. కానీ రైతులకు మేలు చేయాలనే తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే, అక్టోబర్‌ లో రైతు భరోసాను అందించాం. ఇస్తామని హామీ ఇచ్చిన దానికంటే మరో రూ.1000 పెంచి రూ.13,500 ఐదేళ్లపాటు అందిస్తున్నాం. 46లక్షల మంది రైతులు, కౌలురైతులకు దీనిద్వారా మేలు చేసాం.
రైతులకు ఇన్సూరెన్సు ప్రీమియం కట్టే భారం నుంచి ఉపశమనం కలిగించాం. ఈ క్రాప్ లో నమోదు చేసుకుని ఒక రూపాయి కడితే చాలు ఆ తర్వాత ప్రభుత్వమే వారి తరఫున ప్రీమియంను బ్యాంకులకు చెల్లించే ఏర్పాటు చేసాం. కేవలం ఇన్సూరెన్సు ప్రీమియం కోసమే 2100 కోట్ల ఖర్చును రైతుల తరఫున భరిస్తున్నాం.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు వడ్డీలేని రుణాలు పథకాన్ని ప్రారంభించాం. గతంలో రైతులకు వడ్డీలేని రుణాల స్కీమ్ ను లేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఏడాది ఖరీప్, రబీలో రైతులకు వడ్డీలేని రుణాలిస్తాము. వాటి వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని సగర్వంగా చెబుతున్నాను.
కనీస గిట్టుబాటుధర ఇచ్చేందుకు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసాం. ప్రతి రైతన్నకూ తోడుగా ఉంటాం. ఏ రైతూ కూడా తక్కువ ధరకు తన పంట అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా చేసాం.
తొమ్మిది గంటల పగటి పూట కరెంటు ఇవ్వాలని అధికారులతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో 6663 అగ్రికల్చర్ ఫీడర్లలో దాదాపుగా 40% ఫీడర్లలో తొమ్మిదిగంటలు కరెంటు అందించే సామర్థ్యం లేదు అని తెలిసింది. ఇందుకోసం రూ.1700 కోట్లను అందించి, అగ్రికల్చర్ ఫీడర్ల సామర్ధ్యం 100% పెంచేందుకు ఆదేశాలను ఇచ్చాము. జులై నాటికి ఫీడర్లన్నీ తొమ్మిది గంటల పగటి పూట కరెంటు ఇచ్చేలా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. 60% ఫీడర్లద్వారా ఇప్పటికే ఉచిత కరెంటు అందిస్తున్నాము. 2000 కోట్లతో కెనామిటీ రిలీఫ్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.
రైతులకు మంచి జరగాలని, వారికి మేలు చేయాలని భావించి అగ్రికల్చరల్ మిషన్ స్థాపించాం. దానికి నేనే ఛైర్మన్‌గా ఉన్నాను. మరికొందరు ప్రముఖులు, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, అగ్రికల్చర్ జర్నలిస్టు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రికల్చర్ మిషన్ ప్రతినెలా సమావేశమై రాష్ట్రంలో జరిగే పరిస్థితులపై చర్చించి, తగిన చర్యలు తీసుకుంటోంది.
వ్యవసాయానికి పెద్ద పీటవేస్తూ, ప్రతి అడుగూ రైతుల కోసం వేస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం. రైతు భరోసా కేంద్రాలవల్ల రైతులకు మరింత మేలు జరిగి, వారికి మరింత మంచి అందించే అవకాశం రావాలని 

Back to Top