బరాటం రామశేషు హత్యఘటనపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆరా

తాడేప‌ల్లి: శ్రీకాకుళం జిల్లా గార మండలం వైయ‌స్ఆర్‌సీపీ ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరా తీశారు. దివంగత గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలని వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత, రెెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆదేశం.

శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం ఆదేశించారు. 

దీంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే... పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.
గార మండ‌లం, వైస్ ఎంపీపీ బ‌రాటం రామశేషు అంతిమ యాత్రలో రెవెన్యూ శాఖా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.  

Back to Top