పవన్‌ నీ ప్యాకేజీ కోసం కాపులను బలి చేయకు

వారితోనూ చంద్రబాబును మోయించ వద్దు

కావాలంటే గాడిదలా నీవు చంద్రబాబును మోయి

జలవనరుల మంత్రి  అంబటి రాంబాబు స్పష్టీకరణ

కాపులను చంద్రబాబు మోసం చేశారు

రంగాను చంపిన వారిలో చంద్రబాబు ఉన్నాడు

ముద్రగడనూ దారుణంగా వేధించాడు

గుర్తు చేసిన మంత్రి అంబటి రాంబాబు

వారాహి అన్నది అమ్మవారి పేరు

ఆ పేరు రథానికి పెట్టి, ఎలా ఎక్కి తిరుగుతావు?

అలా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు

భస్మం అయిపోతావు. అందుకే రధం పేరు మార్చుకో

పవన్‌కళ్యాణ్‌కు మంత్రి అంబటి సూచన

చల్లకొచ్చి మంత దాచినట్లుగా పవన్‌ వ్యవహారం

తాను చంద్రబాబుతో కలిసి పోనున్నట్లు వెల్లడి

అదే సందేశాన్ని బీజేపీకి పంపించిన పవన్‌కళ్యాణ్‌

ఇవాళ సత్తెనపల్లి సమావేశంలో పవన్‌ మాట అదే

మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

ఎవరో రాసిచ్చిన మాటలతో విమర్శలు సరికాదు

ధైర్యం ఉంటే నాపై ఆరోపణలు నిరూపించు

నేను రాజకీయ సన్యాసం చేస్తాను

మరి నీకు ఆ ధైర్యం ఉందా? నిరూపించగలవా?

పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండగలవా?

అధికారం రాని కులాల కోసం పొత్తులకు వెళ్తావా?

లేక చంద్రబాబుకు అధికారం కోసం వెళ్తావా?

పొత్తులకు ముందే ఈ విషయాన్ని తేల్చగలవా?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మంత్రి అంబటి

తాడేపల్లి: పవన్‌ నీ ప్యాకేజీ కోసం కాపులను బలి చేయకు, వారితోనూ చంద్రబాబును మోయించ వద్దు..కావాలంటే గాడిదలా నీవు చంద్రబాబును మోయి అని రాష్ట్ర జలవనరుల మంత్రి  అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టి, మా పార్టీపైనా, నాపైనా విమర్శలు చేశారు. అలా ఆయన చేసినా, ఆయన బీజేపీకి సూటిగా ఒక సందేశం పంపినట్లుగా అర్ధం అయింది. చల్లకు వచ్చి ముంత దాచినట్లుగా.. తాను అక్కడికి వెళ్లి తాను చంద్రబాబుతోనే కలిసి ఉంటానని, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినా, రాకపోయివనా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడిగారినే గాడిదలా మోస్తాను. మీరు కూడా, నాకు సంబ«ంధించిన వ్యక్తులు కూడా చంద్రబాబును గాడిదలా మోయండి. నా వ్యూహాన్ని నాకు వదిలేయండి అన్న మాటను బీజేపీకి పంపించారు.

వారంతా ఈ విషయం తెలుసుకోవాలి:
    మేము మొదటి నుంచి చెబుతున్నాం. పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాడని.. పాతికో పరకో సీట్లు తీసుకుంటాడని. దీన్ని మేము చాలాసార్లు చెప్పాం. దీన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. అలాగే జనసేన కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే, మా నాయకుడు సీఎం అవుతారని వారు అనుకుంటున్నారు. వారు ఈ వ్యూహం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎందుకు డొంక తిరుగుడు మాటలు?:
    పవన్‌కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గాడిదలా మోయడానికి సిద్ధమైన తర్వాత మరో మాట ఎందుకన్నాడో అర్ధం కావడం లేదు. తాను  ఇంట్లో కూర్చోవచ్చు. సినిమా చేసి పేరు తెచ్చుకోవచ్చు. కానీ అన్నం పెట్టిన నేలకు న్యాయం చేయడం కోసమే పార్టీ పెట్టాను.. అన్నాడు. అంటే ప్రజలకు సేవ చేయడం కోసమే పార్టీ పెట్టానని అంటున్న నీవు, బుద్ధి లేకుండా ఏం మాట్లాడుతున్నావు. డొంకతిరుగుడు మాటలు.
    ఓట్లు చీలనివ్వను. జగన్‌గారు మళ్లీ సీఎం అయ్యే ప్రసక్తి లేదు. మేమంతా కలుస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్పడం? చంద్రబాబుగారి దగ్గర ప్యాకేజీ తీసుకుని, ఆయన్ను మోస్తాను. ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతాను.. అని ధైర్యంగా చెప్పొచ్చు కదా? ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు?
    మొన్న విడిపోయి నష్టపోయాం. ఇప్పుడు మళ్లీ కలుస్తాడట. అసలు ఆయన సిద్ధాంతం ఏమిటి? ఏం మాట్లాడుతున్నాడు.

ఆ విషయాన్ని ప్రతిపాదించగలవా?:
    ఇంకా ఇంత వరకు అధికారం చూడని కులాలకు, అధికారం రాని సామాజికవర్గాలకు అధికారం తీసుకు రావడమే జనసేన లక్ష్యం అన్నాడు. బాగుంది. మేమెంతో మాకంత. మా సంఖ్యా బలం ఎంతో మాకు అన్ని పదవులు కావాలి. అన్నాడు. ఇదీ బాగుంది. మరి ఆచరిస్తావా? ఇంతకు ముందు సీఎం పదవి రాని వాళ్లకు ఆ పదవి ఇవ్వడానికి సిద్ధమవుతావా? అలా ప్రతిపాదిస్తావా? తేలిపోతుంది కదా? పొత్తులప్పుడే తేలి పోతుంది.

చొక్కా పట్టుకోరా?:
    నీవు పాతికో పరకో తీసుకుని పొత్తులకు వెళ్లినప్పుడే చెప్పావు కదా? తప్పులు చేస్తే చొక్కా పట్టుకోవాలని. మరి ఇప్పుడు నీ మాటలు చేతలు చూస్తే.. ప్రజలు ఆ హక్కు అంది పుచ్చుకోరా? వారు నీ చొక్కా పట్టుకోరా?
ఏ కులాలైతే అధికారం రాలేదో..వారికి అధికారం ఇచ్చేలా నీవు పొత్తులకు వెళ్తావా? లేక చంద్రబాబును సీఎం చేయడానికి పొత్తులకు వెళ్తావా?
అయితే మీరు ఎంత మంది కలిసినా.. చంద్రబాబును సీఎం చేయలేరు. ఇది వాస్తవం. అందుకే పవన్‌ మాటలను ప్రజలు అర్ధం చేసుకోవాలి.

రాజకీయ సన్నాసిగా మారావు:
    పవన్‌ ఇంకా ఏమన్నాడు. జగన్‌గారు అధికారంలో వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని 2019లో ఇదే పవన్‌ కల్యాణ్‌ చెప్పాడు. 2019 తర్వాత అతను రాజకీయ సన్యాసం చేయలేదు కానీ రాజకీయ సన్నాసిగా మారాడు. ఇప్పుడు కూడా.. మళ్లీ అలాగే మాట్లాడుతున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ గెలవదని తెగ ఊగిపోతూ.. మాట్లాడాడు. పవన్‌ కల్యాణ్‌ ఏం చెబితే దానికి రివర్స్‌లో జరగుతుందని ప్రజలకు ఇప్పటికే బాగా అర్థమైంది. వారు అన్నీ గమనించారు.

వారితో ఎక్కడైనా పోలిక ఉందా?:
    ఇంకా తనకు కులం, మతం లేదంటాడు. కానీ ఇవాళ గుర్రం జాషువా పేరు ప్రస్తావించాడు. తనకి కులం లేదని.. జాషువా గారిని కోట్‌ చేశాడు. ఈరోజు జాషువా గారు అంటాడు. ఇంతకు ముందు నానీ ఫాల్కీ వాలా? అంతకుముందు బాలగంగాధర్‌ తిలక్‌. మధ్యలో శ్రీశ్రీ. ఆపైన చేగువేరా. ఆ తర్వాత మదర్‌ థెరిస్సా. ఉన్నట్టుండి.. పుచ్చలపల్లి సుందరయ్య. ఇలా.. అనేక మంది నాయకుల పేర్లు చెబుతాడు. వారికి, ఆయనకు ఏ మాత్రం పోలిక లేదు.
    ఇవాళ గుర్రం జాషువా పుస్తకం చదివి ఉంటాడు. అందుకే ఆయన పేరు చెబుతున్నాడు.  నీకు ఏ నాయకుడి లక్షణం లేదు. నీకు ఏ నాయకుడి ఆలోచన లేదు. నీకున్నదల్లా చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ నడిపే దుర్మార్గమైన రాజకీయాలు చేయడం. ఇవాళ కూడా సత్తెనపల్లిలో అదే చేశాడు.

ఆ రథం పేరు మార్చుకో:
    ఇంకా ప్రచార రథం. దానికి విచిత్రమైన పేరు. ఇప్పుడు ఎన్నికలు లేకున్నా, ఆయన ప్రచార రథం తయారు చేసుకున్నాడు. వారాహి అని పేరు పెట్టుకోవడానికి అజ్ఞానం ఉండాలి. వారాహి అమ్మవారి రూపం అయితే.. అమ్మవారి అవతారం మీద పవన్‌ కల్యాణ్‌ ఎక్కి తిరుగుతాడా?  వారాహి ఎక్కి అపవిత్రమైన మాటలు మాట్లాడడం ధర్మమేనా? ద«శావతారాలలో అది ఒక అవతారం. అందుకే వరాహం అని పేరు పెట్టుకుని తిరుగు. ఆ తర్వాత దానిపై తిరుగుతూ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు.
    ఇప్పటికే అన్నావు కదా.. పీకేస్తే మొలుస్తా. తొక్కేస్తే లెగుస్తా.. అన్నావు. ఇప్పుడు చెబుతున్నా.. మళ్లీ వరాహి వాహనం ఎక్కి, పిచ్చి విమర్శలు చేస్తే.. అమ్మవారి ఆగ్రహానికి గురి కాక తప్పదు. 

మేము చెప్పిందే జరిగింది:
    మేము ఇంతకు ముందు చెప్పాం. అమరావతి నుంచి అరసవెల్లి సూర్య దేవాలయానికి అంటూ బయలుదేరిన వారు రైతులు కారని, వారికి చిత్తశుద్ధి లేదని, అందుకే వారు అక్కడికి చేరుకోలేరని చెప్పాం. అదే జరిగింది కదా?
    అందుకే మీ ప్రచార రథానికి వరాహం అని పేరు పెట్టుకుని, తిరిగి, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. లేకపోతే అమ్మవారి శాపం తగులుతుంది. నీవు భస్మమై పోతావు.

మంచి ఆహారం ఇస్తున్నాం. గర్వంగా చెప్పగలం:
    ఇంకా ఏమన్నాడు. మేము  బీసీల సభ పెట్టామంట. దాంట్లో రొయ్యల వేపుడు, చాపల పులుసు, చికెన్‌ బిర్యానీ గురించి మాట్లాడామంట. ఏమిటా పిచ్చి మాటలు. నేను ఒక్కటి మాత్రం గర్వంగా చెప్పగల్గుతున్నాం. 2014–19 మధ్య కంటే మొరుగైన మధ్యాహ్న భోజనాన్ని గవర్నమెంట్‌ బడులు అన్నింటిలోనూ పిల్లలకు ఇస్తున్నాం. కావాలంటే తెలుసుకో. నీ ఫ్రెండ్, ప్యాకేజీ వ్యక్తి పాలనలో ఏనాడూ పిల్లల ఆహారం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంకా ఆయన పరిపాలన గురించి అస్సలు మాట్లాడలేదు.

మాట తప్పితే దెబ్బ తింటావు:
    ఇంకా సత్తెనపల్లికి వచ్చి, అనేక మాటలు మాట్లాడావు. సత్తెనపల్లి అంటే సత్యమ్మ తల్లి వంటిది. అక్కడ మాట్లాడిన ప్రతి మాటకు విలువ ఉంటుంది. ప్రతిదీ అందరూ గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి అందుకు భిన్నంగా వ్యవహరిస్తే దెబ్బ తింటావు. 

నిరూపిస్తే తప్పుకుంటా..:
    ఇంకా నా మీద వ్యక్తిగత విమర్శలు. అందుకే సత్తెనపల్లి ఎంచుకున్నాడేమో? నిజానికి సెంటర్‌ గుంటూరు. నేను కమిషన్లు తీసుకుంటున్నానని, నేను శవాల మీద పేలాలు ఏరుకుంటానని, పోలవరం పనుల్లో అవినీతి చేస్తున్నానని.. ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడావు. ఎవరో రాసిచ్చిన మాటలన్నీ మాట్లాడావు. నేను ఒకటే చెబుతున్నాను. నీ కన్నా, చంద్రబాబు కన్నా బాగా పని చేస్తున్నాను. ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదు.
    రూ.7 లక్షలు బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలకు ఇస్తున్నాం. ఇది రైతులకు ప్రభుత్వం ఇస్తున్న మానవతా సహాయం. అందులో ఒక్క రూపాయి నేను తీసుకున్నట్లు, కనీసం ఒక్క కుటుంబం దగ్గరైనా ఒక్క పైసాకు కక్కుర్తి పడినట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం చేయటమే కాదు.. క్షమాపణలు కూడా చెప్పి.. పూర్తిగా తప్పుకుంటాను. నీకు దమ్ముంటే నిరూపించు. నేరు రైతుల కుటుంబాల దగ్గర రూ.2 లక్షలు తీసుకుంటున్నానా? ధైర్యం ఉంటే నిరూపించు. లేకపోతే పారిపో.

నీవే కాపులకు శని:
    ఇంకా నేను కాపుల గుండెల్లో కుంపటి పెడుతున్నానా?
ఎప్పుడు ఆ పని చేశాను?  గతంలో మద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని నీ పార్టనర్‌ చంద్రబాబు వేధించినప్పుడు, వారికి అండగా నిలబడింది నేను. కానీ నీవు ఇవాళ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని, కాపులను సర్వనాశనం చేయాలని నీవు ప్రయత్నిస్తున్నావు.అందుకే నీవే కాపులకు ఒక శని. ఇది వాస్తవం.

పోలవరంపైనా ఎందుకా విమర్శలు?:
    పోలవరం పనులు నా వల్లే పూర్తి కావడం లేదా? నేను మంత్రి కాగానే పనులన్నీ అవంతట అవే పూర్తవుతాయా? చంద్రబాబు హయాంలో కూడా ఒక మంత్రి ఉన్నాడు కదా? ఆయన 2018లోనే పోలవరం పనులు పూర్తి చేస్తానని, ఆ మాట నిలబెట్టుకోలేదు. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయనను ఎందుకు అడగవు?
డయాఫ్రమ్‌ వాల్‌ ధ్వంసమైంది. దాని పరిస్థితి తెలియదు. అది తేలితే కానీ, ప్రాజెక్టు పనులపై క్లారిటీ రాదు. ఇది వాస్తవం.

నీకసలు బుద్ధి ఉందా?:
    నేను శవాలపై పేలాలు ఏరుకుంటానా? నీకేమైనా బుద్ది ఉందా? ఎవరు ఏది చెబితే అదే మాట్లాడతావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందా?.

నిజమే. అది గ్లాస్‌ కాదు:
    ఇంకో మాట. అది గాజు గ్లాస్‌ కాదు. నా గుండెల్లో బాకు.. ఈ మాట నేను అన్నాను. 2019 ఎన్నికల్లో రాజుపాలెం మండలంలోని  అంచులవారిపాలెంలో ఆ మాట అన్నాను. అక్కడ అందరూ కాపులే. అప్పుడు నేను అన్నాను. మీరంతా పవన్‌కళ్యాణ్‌ పారీ గుర్తు గ్లాస్‌కు వేస్తే, అది నాకు గుచ్చు కుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలోకి రాదు. మీ ఓటుకు ప్రయోజనం ఉండకపోగా, టీడీపీ అభ్యర్థి కోడెల గెలుస్తాడని చెప్పాను. అందుకే గ్లాస్‌కు ఓటేస్తే మురిగి పోతుందని, అది ప్రమాదకరమని అన్నాను.
    ఇప్పుడు కూడా చెబుతున్నాను. గ్లాస్‌కు ఓటేస్తే మురిగి పోతుందని. ఆ పార్టీ అధికారంలో రానే రాదని.

వీటన్నింటికి బదులు ఇచ్చి తీరాలి:
    పవన్‌ కళ్యాణ్‌.. నీవు చేసిన ప్రతి విమర్శకు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు నీవు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడే చెబుతావో. లేక హైదరాబాద్‌కు పోయి చెబుతావో. నీ ఇష్టం.

కాపులను బలి చేయొద్దు:
    వచ్చే ఎన్నికల్లో నీవు పాతికో, పరకో ప్యాకేజీ తీసుకుని, చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తావో, లేక బీజేపీతో వస్తావో, లేక ఒంటరిగా వస్తావో తేల్చుకో. నీ ఇష్టం. నీవు ఎక్కి ఊరేగు. గాడిద మాదిరిగా చంద్రబాబును ఎత్తుకుని ఊరేగుతావో నీ ఇష్టం. 
    అంతే తప్ప, కాపులను అవమానపర్చొద్దు. నీ స్వార్థం కోసం వారిని బలి చేయొద్దు. కాపులందరినీ చంద్రబాబును మోయమనడం తప్పు. ఆయన ఒక దుర్మార్గుడు. వంగవీటిని చంపిన వారిలో చంద్రబాబు ఉన్నాడు. ముద్రగడ పద్మనాభంను కూడా వేధించాడు. 

 కౌలు రైతులను ఆదుకున్నాం:

    వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక, జగన్‌గారు సీఎం అయ్యాక కౌలు రైతులను గుర్తించారు. అలా చేసిన తొలి ప్రభుత్వం ఇది. చాలా మంది భూస్వాములు పంటలు పండించలేదు. చాలా భూములు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే వారికి కూడా కార్డులు ఇచ్చి, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇక్కడ భూస్వాములకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేస్తున్నాం. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వారికి కూడా అన్ని పథకాలు అందేలా చూస్తున్నాం.

బ్రహ్మారెడ్డి ఫ్యాక్షనిస్టు:
    పల్నాడులో బ్రహ్మారెడ్డి చరిత్ర అందరికీ తెలుసు. ఒకేసారి ఏడుగురి హత్య కేసులో బ్రహ్మారెడ్డి ఏ–1. ఆ కేసులో అరెస్టు అయి, బయటకు వచ్చి, మాచర్లలో ఉండడానికి భయపడి, గుంటూరులో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు మాచర్ల బాధ్యతలు అప్పగించాడు. అందుకే అక్కడ మళ్లీ గొడవలు జరుగుతున్నాయి.
    ఒక ఫ్యాక్షన్‌ లీడర్‌ను తీసుకొచ్చి, అక్కడ పెట్టి చంద్రబాబు ఉసి గొల్పుతున్నాడు. బ్రహ్మారెడ్డి వర్గీయులు దాడి చేయడంతో, ప్రతిదాడులు జరిగాయి.

పవన్‌.. టీడీపీలో చేరిపో:
    సొంతంగా పార్టీ పెట్టి, తెలుగుదే«శం పార్టీ గెలుపు కోసం పని చేస్తున్న పవన్‌కళ్యాణ్, నేరుగా ఆ పార్టీలో చేరొచ్చు కదా? ఇలాంటి రాజకీయం ఎవరైనా చేస్తారా? తిరుపతి ఉప ఎన్నిక తర్వాత, ఎక్కడైనా పవన్, బీజేపీతో కలిసి పని చేశాడా? ఆయన బీజేపీతో ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, పూర్తిగా తెలుగుదేశం పార్టీతోనే వెళ్తున్నాడు. అలాగే బీజేపీ వారు కూడా పవన్‌ తమతోనే ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Back to Top