అంబ‌టి రాంబాబుకు చింత‌ల‌పూడి నేత‌ల ప‌రామ‌ర్శ‌  

గుంటూరు:  మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు అంబటి రాంబాబును చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన నాయకులు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి ఆరోగ్య పరిస్థితి, పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ ధైర్యం చెప్పారు. అనంత‌రం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు పార్టీకి చేసిన సేవలు అపారమని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు పార్టీ శ్రేణులంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అంబటి రాంబాబు ఈ సందర్భంగా వచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చురుకుగా ఉండాలని పిలుపునిచ్చారు.  పరామర్శ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజు, కామవరపుకోట మండల అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ, కామవరపుకోట వైస్ ఎంపీపీ తమ్మిశెట్టి గిరిజ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సిరిశెట్టి సిద్ధిరాజు, కామవరపుకోట రామన్నపాలెం ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top