ప్రతిపక్ష సభ్యులు పారిపోయారు

చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
 

అమరావతి: కీలకమైన బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి పారిపోయారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముందుకు ఏపీ మౌలిక (న్యాయ సమీక్ష ద్వారా పారదర్శకత)బిల్లును ప్రవేశపెట్టారు. అయితే సభలో ప్రతిపక్ష సభ్యులు లేకపోవడాన్ని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఇంతటి కీలకమైన బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష సభ్యులు పారిపోయారంటే..గతంలో వారు చేసిన తప్పులు బయటపడుతాయనే భయంతో వెళ్లిపోయారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష సభ్యులు సభలోకి వచ్చి అమూల్యమైన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో బాయ్‌కాట్‌ చేసి పారిపోవడం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. 
 

తాజా ఫోటోలు

Back to Top