భూమన కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

తిరుపతి :  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కుటుంబానికి మేమంతా అండ‌గా ఉంటామ‌ని చంద్రగిరి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. శ‌నివారం భూమన అభినయ్ రెడ్డిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి క‌లిశారు.  ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్రశ్నించే గొంతుకను అణచివేయాలని కుట్రలు చేస్తోంది. భూమ‌న కుటుంబానికి చెందిన ప‌ట్టా భూముల్లో రెవెన్యూ అధికారులు పంపించి కూల్చివేతలు చేస్తున్నార‌ని, బఫర్ జోన్ లో రివిట్ మెంట్ వాల్ నిర్మాణం  చేశారు అని రాద్దాంతం చేసి కూల్చి వేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. నదీ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ ప్రతి ఒక్కరు ఈ పని చేస్తుంటార‌ని, స్వర్ణముఖి నది పరివాహకప్రాంతలో భూమన కుటుంబ ఆస్తులే మీకు కనిపిస్తున్నాయా..? అని సూటిగా ప్ర‌శ్నించారు.  హెరిటేజ్ ఫ్యాక్టరీ సగం బఫర్ జోన్ లో ఉంద‌ని, రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఏంటి..? అని నిల‌దీశారు. ఇలాంటి చర్యలు చేస్తే ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారని హెచ్చ‌రించారు. ఇలాంటి అన్యాయాలు చేసే వారిపై ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థ ఆక్రమణలు నుంచి మొదలు పెడితే మీ పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని వారు హిత‌వు ప‌లికారు.

Back to Top