కడప: గతంలో సోనియా,రాహుల్‌ను ఇష్టమొచ్చినట్లు దూషించిన చంద్రబాబు.. రాష్ట్ర విభజనను సోనియాగాంధీ అద్భుతంగా చేసిందని కితాబు ఇవ్వడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. కడప వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేరే రాష్ట్రాల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై తీవ్రంగా దుయ్యబట్టారు.సోనియాగాంధీ రాష్ట్ర విభజనను అద్భుతంగా చేసిందని చంద్రబాబు చెప్పడం ఆంధ్ర ప్రజలను మోసం చేయడం,అవమానించడం కాదా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు తను చేసిన అవినీతి, అక్రమాలు వెలుగుచూస్తాయని..జైలుపాలు అవుతాననే భయం ఏర్పడిందని,రక్షించుకోవడానికి రాహుల్‌ను పోగుడుతున్నారని తెలిపారు. గతంలో సోనియా,రాహుల్‌ను చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు దూషించారన్నారు.ఇప్పుడు చంద్రబాబుకు సోనియా,రాహుల్‌లు గొప్ప నేతలు అయిపోయారన్నారు.రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పోవడం కాదా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.తన రాజకీయ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారన్నారు.ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు కపట నాటకాలను ప్రజలు గ్రహించాలని కోరారు.చంద్రబాబు పదవికాలం నెలరోజుల్లో ముగియబోతుందన్నారు. అప్పటిదాకా సీఎంగా అనేక పరిమితులకు లోబడి పనిచేయాలన్నారు.అది గ్రహించకుండా చంద్రబాబు,టీడీపీనేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.అధికారిక సమీక్షలు ఎందుకు చేయకూడదని చంద్రబాబు మొండిగా వాదనలు చేస్తున్నారని తప్పబట్టారు.ఐదేళ్లు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అతిక్రమించి చంద్రబాబు అప్పులు తెచ్చారన్నారు.ఐదేళ్లలో రాష్ట్ర్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.