నేతిబీర బుద్ధి

నేతిబీర కాయలో నేయి ఉంటుందా? మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందా? తెలివి పేరులో ఉన్నంత మాత్రాన బుర్రలోనూ ఉంటుందనుకోవడం భ్రమే. బుద్ధులందు పచ్చ బుద్ధులు వేరయా అని ఊరికే అన్నారా?

ఆర్టీసీ అప్పులకు కారణం జగన్ అంటాడు బుద్ధి లేని వెంకన్న.

ఆర్టీసీని సొంత ఆస్తిలా వాడుకున్నప్పుడు బాబుకు బుద్ధి చెప్పాలని ఈ వెంకన్నకు అనిపించలేదంటే అది బుద్ధి లేనితనమే గదా.

పోలవరం యాత్రలని, సచివాలయం సందర్శనం అని చెప్పి వందలాది ఆర్టీసీ బస్సులుతిప్పి బకాయిలు ఎగ్గొట్టినప్పుడు తప్పని చెప్పని వెంకన్నది బుద్ధిమాలినతనం కాదా?

దిక్కుమాలిన దీక్షలు, పనికిరాని మీటింగులు అన్నిటికీ ఆర్టీసీ బస్సులను బాబు అప్పనంగా వాడేస్తున్నప్పుడు అడ్డుకోని వెంకన్న బుద్ధి అప్పుడు బురదలో దొర్లుతూ ఉందా..?

డ్వాక్రా మీటింగుకీ, పార్టీ సెట్టింగులకు, మహానాడు ముచ్చట్టకీ ఆర్టీసీ బస్సులు తరలించేస్తున్నప్పుడు వెంకన్న బుద్ధి ఏ పచ్చగడ్డి తింటోందంటారూ..!!

ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టేసి, ఆర్టీసీ కార్మికుల పిట్మెంట్ ఎగ్గొట్టేసినప్పుడైనా బుద్ధి తెచ్చుకోమని బాబుకు చెప్పని వెంకన్నకు బుద్ధి అసలు ఉన్నట్టా లేనట్టా??

ఆర్టీసీని బలోపేతం చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేస్తుంటే అప్పుల పాలు చేస్తున్నారన్న బుద్ధా వెంకన్నలో బుద్ధి బహు కొద్దిగా కూడా లేదంటే మీరు ఏకీభివిస్తారా లేదా?

నీళ్లల్లో కొరివి, తమ్ముళ్లలో తెలివి ఉడటం ఉత్తిమాట అని బుద్ధా మరోసారి నిరూపించాడన్నమాట.

Back to Top