అసలు దళిత ద్రోహి చంద్రబాబే 

చంద్రబాబు హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం  

అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో శుద్ధి చేసిన‌ పార్వతీపురం వైయ‌స్ఆర్‌సీపీ దళిత నాయకులు

పార్వతీపురం:  దళితులకు అండగా నిలిచేది, నిలుస్తున్నది ఎప్పటికీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారే, ఆయన హయాంలోనే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మించి దళితుల గౌరవాన్ని మరింత పెంచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్య‌క్షుడు సర్వే శెట్టి శ్రీనివాసరావు అన్నారు.  చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్ప‌టించి, ఆ నెప్పాన్ని వైయ‌స్ఆర్‌సీపీపై నెట్ట‌డాన్ని నిర‌సిస్తూ పార్వ‌తీపురం ఇందిరా కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్ర‌హాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి నివాళులర్పించారు.   ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయ‌కులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలోనే దళితులపై ఆకృత్యాలు పెరిగిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.   పార్వతీపురం నియోజకవర్గంలో ఒక దళిత నాయకుడికి కూడా ఏ పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని, అలాంటిది మీరూ వైయ‌స్ జగన్ గురించి మాట్లాడేది అంటూ మండిప‌డ్డారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ  అధ్యక్షుడు కోల సుధాకర్, కౌన్సిలర్ నిమ్మకాయల సుధీర్, వండాన నేతాజీ, స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గండి భాగ్యవతి, స్టేట్ ఆర్టిఐ ప్రధాన కార్యదర్శి దేవుపల్లి నాగరాజు, స్టేట్ కార్యదర్శి కాగాను ప్రకాష్,  సీనియర్ నాయకులు గండి లక్ష్మీ, గండి ప్రభావతి, సొండి గోపి, కోల క్రాంతి, చింతాడ రాజేష్, సొండి నారాయణరావు, పట్టణ దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top