స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు

 అవసరమైన పత్రాలు జారీ చేయాలని కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు

 గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లతో పాటు అవసరమైన ఇతర పత్రాలను అధికారులు జారీ చేయడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు.

అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని అందించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అవసరమైన పత్రాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, డైమండ్‌ బాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు.

Back to Top