దొంగను అరెస్ట్ చేస్తే తప్పేంటీ..? 

మాజీ మంత్రి కొడాలి నాని

చంద్ర‌బాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్‌ ఏనాడో చెప్పారు

దొంగలంతా చంద్రబాబుకి సపోర్ట్‌ చేస్తారు

విజ‌య‌వాడ‌:  దొంగ‌ను అరెస్టు చేస్తే త‌ప్పేంటీ అని మాజీ మంత్రి కొడాలి నాని ప్ర‌శ్నించారు. రూ.118 కోట్ల వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులపై స్పందించని వాళ్లు.. ఇవాళ స్కిల్‌ స్కాంలో అరెస్ట్‌ కాగానే చంద్రబాబుకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారని  కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రభుత్వం చేయిస్తోంది అని టీడీపీ,రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని కొడాలి నాని కొట్టి పారేశారు.  
చంద్రబాబు స్కామ్‌ చేయనిది ఎప్పుడు?. ఆయనో 420, అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్‌ ఏనాడో చెప్పారు. బాలకృష్ణ, పురందేశ్వరి ఆ అవినీతి చక్రవర్తికి మద్దతిస్తారా?. బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. లోకేష్‌ రాసిచ్చిందా? చంద్రబాబు డైలాగులా.. అవన్నీ?.  చంద్రబాబుతో కలిసి తండ్రి ఎన్టీఆర్‌కు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచారు.  పవన్‌ కల్యాణ్‌తో పార్టీ పెట్టించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పెట్రోల్‌ కొట్టిస్తేనే.. పవన్‌ తన వారాహిని బయటకు తీస్తాడు. ప్యాకేజీ తీసుకునేవాడు అంతకన్నా ఏం మాట్లాడతాడు!.

చంద్రబాబు అవినీతిలో వీళ్లందరికి భాగం ఉంది.  కాబట్టే..  దొంగలంతా చంద్రబాబుకి సపోర్ట్‌ చేస్తారు. లేకుంటే వీళ్ల పేర్లు ఎక్కడ బయటపెడతాడో అనే భయం ఉంటుంది కదా. అందుకే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే వీళ్లంతా చదువుతారు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

వైయ‌స్ఆర్‌కు చంద్రబాబుకు 40 ఏళ్లపాటు రాజకీయ వైరం కొనసాగిందని.. ఏనాడూ కక్ష రాజకీయాలు కనిపించలేదన్న సంగతి గుర్తు చేశారు. ఈ కేసులో(స్కిల్‌ స్కాం కేసు) పది మంది అరెస్ట్‌ అయ్యారు. కొంతమందికి బెయిల్‌ వచ్చింది.. కొంత మందికి జైల్లో ఉన్నారు అని గుర్తు చేశారు. చంద్రబాబు మీద విచారణ జరిగింది. చివరకు అరెస్ట్‌ చేశారు అని కొడాలి తెలిపారు.

Back to Top