కేబినెట్‌ భేటీ ప్రారంభం

పలు కీలక అంశాలను చర్చించనున్న మంత్రి మండలి

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కేబినెట్‌లో పలు కీలక అంశాలపై చర్చించి.. ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ, నివారణ చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీకి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అదే విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలపనుంది. జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో ప్రభుత్వ ఉద్యోగుల 10 శాతం ఇళ్ల స్థలాల కేటాయింపు, 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్ల కేటాయింపు అంశంపై చర్చించనున్నారు. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక రూ.2,250 నుంచి రూ.2500 పెంచిన ఉత్తర్వులు, ఈబీసీ నేస్తం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. 
 

Back to Top