రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలు

 ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  

విజ‌య‌వాడ‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-2020లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతంగా ఉన్నట్ల తెలిపారు. వ్యవసాయరంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పారు. 20202-2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌లో ఏపీకి 3వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో ఏపీకి 5,6 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

 
తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు ప్రజలను బురిడీ కొట్టించలేరని ఆయన మండిపడ్డారు.  ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి టీడీపీకి అనుకూలమైన లెక్కల చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

Back to Top