నిర్మలా సీతారామన్‌ను కలిసిన మంత్రి బుగ్గన

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరానన్నారు. ప్రత్యేకహోదా, ఆర్థికలోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు...రామాయపట్నం పోర్టుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాన్నారు. పోలవరం పనుల వేగం పెంచేందుకు రివాల్వింగ్‌ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని సడలించాలని కోరానన్నారు. అలాగే మౌలిక వసతులకు గ్రాంట్లు ఇవ్వాలని, ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. ఏపీలో వృద్ధి రేటు 8శాతంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top