క్వారీలో పేలుడు ఘటనపై సీఎం వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి 

వైయ‌స్ఆర్ జిల్లా: కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురాయి గనుల్లో జిలెటిన్‌స్టిక్స్ పేలి తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్వారీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన కారణాలను సీఎం.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముగ్గురాయి గనుల్లో బ్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తరలించారు. అన్‌లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి  వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top