చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాలోని మామిడి రైతులను పట్టించుకోవడం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా ఈ నెల 9వ తేదీ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ బంగారుపాలెంలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. వైయస్ జగన్ పర్యటన ఏర్పాట్లపై గురువారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కే రోజా, భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీల్, బియ్యపు మధు సూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. `గత ఆరు నెలలుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా అనూహ్యమైన జన స్పందన వస్తోంది. ఈనెల 9 న జరిగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. చంద్రబాబు సొంత జిల్లా లో మామిడి రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. పల్ప్ ఫ్యాక్టరీలు 90 శాతం టీడీపీ వారివి ఉంటే... టీడీపీ దిన పత్రికలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పచ్చ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 9న బంగారుపాలెంలో వైయస్ జగన్ పర్యటన విజయవంతం చేయాలి` అని భూమన కోరారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి కామెంట్స్.. మామిడి రైతుల దుస్థితి దారుణంగా ఉంది మామిడి పంట రోడ్డు పక్కన పడేస్తున్నారు ఎల్లో మీడియా కు ఇది కనిపించడం లేదు వైయస్ జగన్ అన్న పర్యటన విజయవంతం చేయాలి ఆర్. కే.రోజా, మాజీ మంత్రి కామెంట్స్ ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది కళ్ళ బొల్లి మాటలు వాగ్దానాలు కు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చాడు కుక్క తోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు కరోనా లాంటి విపత్తర పరిస్థితి లో కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకు జగన్ అన్న సాయం చేశారు ఈనెల 9 న జరిగే మామిడి రైతులు కు వస్తున్నారు అని తెలియగానే ఒక అలజడి మొదలైంది సీఎం చంద్రబాబు ఇదే జిల్లవాసి అయినప్పటికీ మామిడి రైతులు కష్టాలు తెలియనట్లు మాట్లాడుతున్నారు ఇదే జిల్లాలో పుట్టి పెరిగావు, నీ వయసు ఎంత..?. రైతులు కు అన్యాయం జరుగుతూ ఉంటే నీకు తెలియడం లేదా..? సొంత జిల్లాలో రైతులకు ఏమి చేయని దౌర్భాగ్య స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారు మామిడి రైతులు సిండికేట్ గా మారి రైతులు ను దోచుకుంటున్నారు టిడిపి, జనసేన పార్టీవాళ్ల మెడలు వంచి రైతులను కాపాడు కోవాలి, మామిడి రైతులు కు అండగా ఉండి మనం కాపాడుకోవాలి వ్యవసాయ మంత్రి ఎక్కడెక్కడో ఉండి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ను మాట్లాడటం కాదు..చిత్తూరు జిల్లా కు వస్తే రైతులు పాతేస్తారు కూటమి ప్రభుత్వం ను బంగాళాఖాతంలో కలిపేస్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఈనెల 9 న జరిగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి కూటమి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి పర్యటన కు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు మనపై కేసులు పెట్టినా లెక్క చేయకుండా జగన్ మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి అన్ని జిల్లాలు కంటే చిత్తూరు జిల్లా బంగారుపాల్యం జగన్ పర్యటన విజయవంతం చేయాలి మన జిల్లాలో ఏమి జరిగినా సంచలనంగా మారుతుంది,