ఓటర్లను డబ్బుతో కొనాలని చంద్రబాబు కుట్ర

సిగ్గు, లజ్జ లేని వ్యక్తి చంద్రబాబు

మారిపోయానంటూ ప్రజలను మరోసారి మోసం చేశాడు

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

జరగబోయే ఎన్నికలు బాబు, ప్రజల మధ్య యుద్ధం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

విశాఖపట్నం: ఇచ్చిన మాట నెరవేర్చలేని సిగ్గు, లజ్జ లేని వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. విశాఖపట్నం యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురంలో జరిగిన రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో అందరూ నమ్మండి నేను మారిపోయానని చంద్రబాబు చెప్పడంతో ప్రజలంతా నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టారన్నారు. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో చంద్రబాబు మారలేదని ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. మారిపోయానని చెప్పిన చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను మోసగించానని తానే ఒప్పుకున్నాడన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంత ఘోరమైన పాలన, పక్షపాతమైన పాలన, చట్ట విరుద్ధమైన పాలన ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఎక్కడా లేదన్నారు. అవినీతి, అరాచకాలతో నాలుగు సంవత్సరాల పది నెలల పాలన చేసిన చంద్రబాబు డబ్బుతో ఎన్నికలు జరపాలని చూస్తున్నాడన్నారు. 

ప్రతి నియోజకవర్గానికి చంద్రబాబు రూ. 25 కోట్ల డబ్బు మూటలు దించారని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని ధర్మాన గుర్తు చేశారు. రూ. 5 వేలకు ఓటు చొప్పున కొనుగోలు చేయాలని చూస్తున్నాడన్నారు. రూ. 5 వేలు ఒక ఓటుకు ఇస్తే ఐదు సంవత్సరాలకు రోజుకు రూ. 2 ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా అవుతుందన్నారు. దయచేసి ప్రజలెవరూ డబ్బులకు లొంగొద్దన్నారు. రాష్ట్రంలో అనిన వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని, ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళలు, రైతులు, నిరుద్యోగులు బాబు పాలనలో తీవ్రంగా నష్టపోయారన్నారు. డ్వాక్రా గ్రూపులను సృష్టించింది నేనే అని మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వస్తే రూ. 5 లక్షల రుణమాఫీ అని చెప్పి దాన్ని రూ. 3 వేలకు తీసుకువచ్చాడన్నారు. నమ్మించి డ్వాక్రా సంఘాలను నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో రూ. 400 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈవెంట్‌ల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని క్షమించకూడదన్నారు. 

త్వరలో జరగబోయే ఎన్నికలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న యుద్ధం కాదని, చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. బాబు పాలనకు చరమగీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని సర్వేలు వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తుందనే చెబుతున్నాయన్నారు. 

 

నమ్మించి మోసం చేయడం బాబుకు అలవాటు : అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: ప్రజలను, నమ్మిన నాయకులను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అచ్చుతాపురంలో జరిగిన రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు 45 సార్లు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. 

Back to Top