తిరుప‌తిలో ఇంటింటికీ "బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ " 

తిరుప‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు తిరుపతి నియోజకవర్గం ఉత్తరం మండలం  40వ వార్డు నాయకుల ఆధ్వర్యంలో శ‌నివారం ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం నిర్వ‌హించారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త  భూమన అభినయ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంటింటా ప‌ర్య‌టించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏడాది పాల‌న‌లో చేసిన మోసాల‌ను వివ‌రిస్తూ..క్యూఆర్ కోడ్‌ను ప్ర‌జ‌ల‌తో స్కాన్ చేయించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ లడ్డు భాస్కర్, పడమర మండలాధ్యక్షుడు బృంగి నవీన్ , చిన్న పెరుగు బాబు యాదవ్, పెద్ద పెరుగు బాబు, మహి, వంశి, యోగానంద రెడ్డి, నాగరాజు, యామిని, కిరణ్, చిట్టి, శ్యాం,  నాయకులు పాల్గొన్నారు. 

Back to Top