ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఇంటర్‌ మొదటి సంవత్సరం 54 శాతం, రెండో సంవత్సరంలో 61 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచెయ్యి

తాడేపల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  విడుద‌ల చేశారు.  రికార్డు స్థాయిలో ప‌రీక్ష‌లు ముగిసిన 28 రోజుల్లోనే ఫ‌లితాలు విడుద‌ల చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.  ఫ‌లితాల విడుద‌ల అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.  మే నెలలో జరిగిన ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేశాం. ఇంట‌ర్ మొదటి సంవత్సరం 4,45, 604, రెండో సంవత్సరం 4,23455 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒకేషనల్‌ కోర్సుకు కూడా పరీక్షలు నిర్వహించాం. వాటిలో 72, 299 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా 9, 41, 350 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాం. 
ఇందులో మొదటి సంవత్సరంలో 4,45,604 పరీక్షలు రాస్తే 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇందులో 54 శాతం పాస్‌ అయ్యారు. రెండో ఏడాది 4,23, 455 పరీక్షలు రాయగా 2,58,449 మంది పాస్‌ అయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
మొదటి ఏడాది బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. రెండో ఏడాది బాలురు 55 శాతం, బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారు. రెండేళ్లలో బాలికలే ఎక్కువశాతం పాస్‌ అయ్యారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 45 శాతం, రెండో ఏడాది 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అగ‌స్టు 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. 

Back to Top