సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు 

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ట్వీట్‌

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌ పేజీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శనివారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌- వైయ‌స్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్‌ ద్వారా తెలియజేశారు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్. 

తాజా వీడియోలు

Back to Top