లండన్‌లో ఘనంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ జన్మదిన వేడుకలు 

లండన్‌:  వైయ‌స్ఆర్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి వచ్చిన వైయ‌స్ జగన్‌గారి అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు ప్రసంగించారు. వైయ‌స్ఆర్‌సీపీ యూకే కన్వీనర్ డాక్టర్‌ ప్రదీప్ చింతా ప్రసంగిస్తూ.. రానున్న మూడు నెలల్లో ప్రతిఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి వైయ‌స్ జగన్ గెలుపుకు కృషిచేయాలన్నారు. 

ప్రతీపేదవాడి కోసం జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ కమిటీ సభ్యులు ఓబుల్‌రెడ్డి పాతకోట , అనంత్‌రాజు పరదేశి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, మన్మోహన్ యామసాని, జనార్ధన్ చింతపంటి, జయంతి, ప్రతాప్ భీమిరెడ్డి, సురేందర్‌రెడ్డి అలవల, శ్రీనివాసరెడ్డి దొంతిబోయిన, గాంధీ రెడ్డి పోలి, భాస్కర్‌రెడ్డి మాలపాటి, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top