ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. దశల వారీగా పెన్షన్‌ పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల (జనవరి) నుంచి పెన్షన్‌ రూ.2,750 లబ్ధిదారులకు అందించనున్నారు. పెన్ష‌న్ పెంపు నిర్ణ‌యానికి కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. ఈ నిర్ణయం వల్ల 62.31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరగనుంది. అదే విధంగా మాండూస్‌ తుపాన్‌ ప్రభావంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 

Back to Top