ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

అమరావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగుతోంది. అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ చర్చిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విచారణకు హజరయ్యారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top