అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితం అన్నమయ్య జిల్లా అంగళ్లు చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అవ్వాతాతలు కదిలొచ్చారు... మనవడిని చూసి మురిసిపోయారు. అక్కచెల్లెమ్మలు తరలివచ్చారు... సోదరుడిని చూసిన సంతోషంలో ఉప్పొంగిపోయారు. యువకులు పరుగున వచ్చారు... అన్నను చూసి ఉత్సాహంతో ఉరకలేశారు. ఒకరేమిటి..జననేతను చూసిన ఆనందంలో అందరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయనపై ఆత్మీయ జల్లు కురిపించారు. సీఎం వైయస్ జగన్ మంగళవారం అన్నమయ్య జిల్లాలో చేపట్టిన బస్సు యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అడుగడుగునా వైయస్ జగన్ పై అభిమానులు పూలవర్షం కురిపిస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయక భారీగా జనం తరలివస్తున్నారు. బాణసంచా పేలుళ్లు...క్రేన్‌ల ద్వారా గజమాలలతో ఘన స్వాగతం. ఊరూరా అంబరమంటిన సంబరం... మార్మోగిన జగన్నినాదం. చిన్న పిల్లలను ఎత్తుకుని జగన్‌ను చూసేందుకు వచ్చిన మహిళలు. బైక్ ర్యాలీలతో యువత జోరు.. నృత్యాలు చేస్తూ జనహోరు ప్రతి చోటా కనిపిస్తోంది.