కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
 

అమ‌రావ‌తి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ అన్నారు. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఆయ‌న సెల్యూట్ చేశారు. ఉభయ సభలనుద్దేశించి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు.  దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉందన్నారు. ‘‘దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌. కొత్తగా కోవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం.  ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ కోవిడ్‌ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశాం. ఆక్సిజన్‌ కొరత లేకుండా ఇతర దేశాల నుంచీ క్రయోజనిక్‌ ఆక్సిజన్ తెప్పించాం’’ అని గవర్నర్‌ తెలిపారు.  

తాజా వీడియోలు

Back to Top