ఒక సంతకం.. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట  

అనంత‌పురం మేయర్ మహమ్మద్ వసీం

అనంత‌పురంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

అనంతపురం:  ఒక సంతకం పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న  కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా నగరంలోని పాతురు మసీదులోమాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షులు మన్సూర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానం వల్ల  వైద్య విద్యలో మైనార్టీలకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు అందించిన  4 శాతం రిజర్వేషన్లు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చి 16 నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో  ముస్లిం మైనారిటీ లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రధానంగా 50 ఏళ్లకే మైనారోటీ లకు పెన్షన్  ,
హజ్ హౌస్ కు నిధులు కేటాయింపు,వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు కేటాయింపు,దుల్హన్ పథకం అమలు,
మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్ ద్వారా యువతకు రూ. 2-5 లక్ష వరకు రుణ సహాయం,మౌజం లకు రూ.5వేల నుండి రూ.10 వేలకు పెంపు హామీలు అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు.గతంలో ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా గుర్తింపు ఇచ్చిన ఘనత వై.య‌స్ కుటుంబానికి మాత్రమే దక్కిందన్నారు. అనంతపురం నగరంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముస్లిం మైనారిటీలకు రాజకీయ గుర్తింపు అందించారన్నారు. ముస్లిం మైనారిటీలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ప్రజా ప్రయోజనార్థం తీసుకువచ్చిన 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆశయంతో ప్రారంభించడమే కాకుండా 5 కాలేజీలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో మిగతా మెడికల్‌ కాలేజీలు నిర్మాణం పూర్తి చేయకుండా వాటిని ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందోన్నారు.అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టడం జరుగుతొందన్నారు. కూటమీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు తెలపాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, కో అప్సన్ మెంబర్ శంశుద్దిన్ ,మాజీ వక్స్ బోర్డ్ చైర్మన్ కాగజ్ ఘర్ రిజ్వాన్ ,  వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ నాయకులు బాబా, ఖాజా, బాకె హాబీబుల్లా, మహమ్మద్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top