అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం చేతుల మీదుగా సాయం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులు సాయం అందుకోనున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1150 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. తొలి విడతగా రూ.264.99 కోట్లను విడుదల చేశారు. రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన 3.69 లక్షల మందికి తొలి విడతతో న్యాయం జరగనుంది. ఈనెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో పాల్గొని అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యమంత్రి సభకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణ, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

 

Read Also: తొలగుతున్న చీకట్లు

Back to Top