తొలగుతున్న చీకట్లు

విద్యుత్ పై రోజూ మూడు కోట్లు ఆదా

ఏపీ విద్యుత్ సంస్థలు పొదుపుబాట పట్టాయి. యూనిట్ కు రూ.6.56 ఖర్చుపెట్టిన లాలూచీ కరెంటు కొనుగోళ్లకు కాలం చెల్లింది. ఏపీ డిస్కంలు చౌక విద్యుత్ కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నాయి. రోజువారీ అవసరాన్ని అంచనా వేసి బహిరంగ మార్కెట్ లో ఎక్కడ తక్కవ ఉంటే అక్కడినుంచే కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం యూనిట్ కరెంటు కొనుగోలు ధర రూ.3.15 మాత్రమే. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ధర రూ.4ల కంటే ఎక్కువే ఉంటోంది. అయితే బహిరంగ మార్కెట్లో అంతకంటే తక్కువకు దొరుకుతుండటంతో డిస్కంలు చౌక విద్యుత్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.దీనివల్ల నిత్యం డిస్కంలకు 3కోట్ల రూపాయిల మేర ఆదా అవుతోంది. 
ఓపక్క థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు ఏపీ జెన్కో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మార్కెట్ లో విద్యుత్ ధర పెరిగినప్పుడు థర్మల్ వినియోగించుకునేలా ముందస్తుప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. విద్యుత్ డిమాండ్ ను అంచనా వేయడం ద్వారా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. 
గత ఐదేళ్ల కాలంలో విద్యుత్ రంగంలో బహిరంగ మార్కెట్ పై పరిశీలన, అంచనాలు వేసింది లేదు. కారణం చంద్రబాబు సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్ల నుంచే అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒత్తిళ్లు ఉండేవి. ప్రతినెలా రూ.100 కోట్ల భారాన్ని డిస్కంలు భరించాల్సి వచ్చేది. గత ఏడాది అక్టోబర్ మాసంలో యూనిట్ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్ల కరెంటు కొన్నారు. ఈ ఏడాది ఇదే నెలలో యూనిట్ కేవలం రూ.3.38 కే 23 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసారు. అంటే ధరలో సగానికిపైగా వ్యత్యాసం అన్నమాట. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ కరెంటు ధర మరికొన్ని తగ్గి యూనిట్ 3.12పైసలకే లభిస్తోంది. విద్యుత్ శాఖా అధికారులతో సీఎం వైయస్ జగన్ తరుచూ సమీక్షలు జరిపారు. డిస్కంల రుణభారాన్ని తగ్గిస్తున్నారు. బాబు అనుకూల ప్రైవేటు సంస్థలనుంచే అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు చెక్ పెట్టారు. కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా వెనక్కుతగ్గకుండా ప్రజాధనం దుర్వినియోగాన్ని అదుపు చేసారు. అత్యున్నత న్యాయస్థానం సైతం వైయస్ జగన్ ప్రభుత్వం పీపీఏల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది సంక్షేమ ప్రభుత్వ సిద్ధాంతం సాధించిన నైతిక విజయం. ప్రజాధన దుర్వినియోగం అరికట్టి ప్రతిరూపాయికీ ప్రయోజనం కల్పించేలా పాలన సాధ్యం చేసి చూపించిన యువనాయకుడి విజయం. 

 

Read Also:అన్ని వర్గాల సంక్షేమానికి నవరత్నాల పథకాలు అమలు  

Back to Top