తాడేపల్లి : డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. - విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. సమావేశంలో నేతలు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే సీబీఐ విచారణే మార్గమని, బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. - అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో పారదర్శకత కనిపించడం లేదని, నిబంధనలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. - గూడూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. - బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ఆధ్వర్యంలో జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో పార్టీ నాయకులు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని, సమగ్ర సీబీఐ విచారణ జరగాలని కోరారు. - తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. - రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని, రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - పుంగనూరు యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, జింకా చలపతి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి మంత్రి లోకేష్‌ను బాధ్యత వహింపజేయాలని డిమాండ్ చేశారు. - కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా జరిగిన సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. కాటసాని మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. - డోన్ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ డీఎస్సీపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. - అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రేగం చాణక్యతో పాటు పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేగం మత్స్యలింగం మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. - శింగనమల డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, వంశీ గోకుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శైలజనాథ్ మాట్లాడుతూ డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ యువతకు న్యాయం చేయాలని కోరారు. - రాయచోటి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా అక్రమాలతో పాటు విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలపై కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. - విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో కంచరపాలెంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ డీఎస్సీ స్కాంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువత మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని కోరగా, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మహిళలు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న భారీ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. - భీమిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన ఆనందపురంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయకుమార్, మండల, వార్డు అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న శ్రీను మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, ఆగస్టు 6 నుంచి 9 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న ఆనందపురం నుంచి తగరపువలస వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. - నాయుడుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమావేశంలో నియోజకవర్గ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. సంజీవయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. - గంగాధర నెల్లూరు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భూమన కరుణాకర్‌రెడ్డి, వల్లివేడు పృథ్వీరెడ్డి హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి జరిగే రిలే నిరాహార దీక్షలు, 10న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అంశాలపై ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. - విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, మాజీ కార్పొరేటర్లు, జిల్లా, రాష్ట్ర నాయకులు, వార్డు అధ్యక్షులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ స్కాంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని కోరుతూ, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. - విశాఖపట్నం (తూర్పు) మొల్లి అప్పారావు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, విద్యార్థుల బకాయిల విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. - బనగానపల్లె బనగానపల్లె నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, విద్యార్థి–యువజన విభాగాల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. సమావేశంలో నేతలు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. - పెనుకొండ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో పరిగి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ అనంతరం టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. యువజన విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. - చిత్తూరు గంగాధర నెల్లూరు నియోజకవర్గ నాయకులతో చిత్తూరులో రాష్ట్ర మాజీ మంత్రి కార్యాలయంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వల్లివేడు పృథ్వీరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. - పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన జెన్ జెడ్ వార్–టౌన్ హాల్ సమావేశంలో యువత, నిరుద్యోగులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జోగారావు మాట్లాడుతూ డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి చెల్లించాలని కోరారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న డీఎస్సీ బాధితులకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. - మంగళగిరి మంగళగిరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో విద్యార్థులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. - ప్రత్తిపాడు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో విద్యార్థులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. - తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో విద్యార్థులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. - వినుకొండ వినుకొండలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో విద్యార్థులు, యువత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. - పోలవరం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి, నియామక ప్రక్రియలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఆగస్టు 6 నుంచి 8 వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. - పత్తికొండ పత్తికొండ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ మెగా డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.