వైయ‌స్‌ఆర్‌ చేసిన మేలు చిరస్మరణీయం

 మాజీ మంత్రి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్

కృష్ణానది జలాలతో వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి జలాభిషేకం

శింగణమల: పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలు ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకుంటారని మాజీ మంత్రి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి సందర్భంగా శింగణమలలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, కృష్ణానది జలాలతో జలాభిషేకం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్‌ పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత వంటి కార్యక్రమాలతో వైయ‌స్‌ఆర్‌ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని శైలజానాథ్ తెలిపారు. 17 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదని, వైయ‌స్‌ఆర్‌ ఆశయాల కోసం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top