‘వెన్నుపోటుకు రెండేళ్లు’

పట్టణాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమం

విశేష స్పందన. కార్యక్రమం విజయవంతం

తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయని సీఎం చంద్రబాబు, ఈ రెండేళ్లలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కార్యాచరణలో రెండో ఘట్టం సోమవారం రాష్ట్రమంతా ఘనంగా జరిగింది. అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు చోట్ల ఫోటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వీడియోలు కూడా ప్రదర్శించారు.
నిరసన కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఎలా జరిగాయంటే..:

  • విజయనగరం:
  • కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి అక్రమాలే చేస్తోంది, వైయ‌స్ఆర్‌సీపీ టౌన్‌ హాల్‌ మీటింగ్‌లో కూటమి తీరును ఎండగట్టిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి. చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన. వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద నల్ల బెలూన్లతో నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్‌ విజయలక్ష్మి. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా నెల్లిమర్లలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల నిరసన
  • చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాంలో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త రాజేష్‌ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన
  • విశాఖపట్నం:
  • విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై సదస్సు, హాజరైన రీజనల్‌ కోఆర్డినేటర్‌ కన్నబాబు, కేకే రాజు, నియోజకవర్గ సమన్వయకర్త విజయప్రసాద్‌.
  • అనకాపల్లి:
  • చోడవరంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లుపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు. సదస్సు నిర్వహణ.
  • ఎన్టీఆర్‌ జిల్లా:
  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గుర్తు చేశారు.
  • బాపట్ల:
  • చీరాలలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన, చీరాల కారంచేడు రోడ్‌ గేట్‌ సెంటర్‌ దగ్గర ధర్నా, మోసపూరిత హామీలతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపాటు.
  • పల్నాడు:
  • అచ్చంపేటలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా టౌన్‌హాల్‌ సదస్సు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. పార్టీ నాయకులు. కార్యకర్తలు.
  • ప్రకాశం:
  • చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సెమినార్‌ కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరు ఇన్‌ఛార్జ్‌ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని, సూపర్‌సిక్స్‌ పేరుతో ప్రజలను దగా చేసిందని వైయస్సార్‌సీపీ నాయకుల ఆక్షేపణ.
  • అనంతపురం:
  • చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గార్లదిన్నె మండలం కల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీనియోజకవర్గస్థాయి సమావేశం, హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌.ఎం. మోహన్‌ రెడ్డి. గుంతకల్లులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం, నల్లబెలూన్లు ఎగరవేసి ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి.
  • వైఎస్‌ఆర్‌ జిల్లా:
  • పులివెందులలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం, నల్లబెలూన్లతో నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీనాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు మోసాలపై ఫొటో ఎగ్జిబిషన్, పాల్గొన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, చవ్వా దుశ్యంత్‌రెడ్డి. చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరసన. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరసన కార్యక్రమం. వెన్నుపోటు పాలనపై ఫొటో ప్రదర్శన.
  • శ్రీసత్యసాయి జిల్లా:
  • పుట్టపర్తిలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం, నియోజవకర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం, చంద్రబాబు హామీలు,మోసాలపై చర్చ
  • కర్నూలు:
  • చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ఆలూరులో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి, అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారు: ఎమ్మెల్యే విరూపాక్షి
  • నంద్యాల:
  • నందికొట్కూరులో వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డా.సుధీర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం. చంద్రబాబు హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆక్షేపణ. చంద్రబాబు అబద్ధపు హామీలను నిరసిస్తూ బ్లాక్‌ బెలూన్లు వదిలి నిరసన తెలిపిన డా.సుధీర్‌. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజలు.
Back to Top