పచ్చ అజ్ఞానులు

ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3 టిఎమ్‌సిలు. ఇప్పటికి ఉన్న ఇన్ఫో 2టిఎమ్‌సిలు. బ్యారేజీ కెపాసిటీ వరకూ అంటే 3 టిఎమ్‌సీలను నిల్వ చేస్తే కరకట్టచుట్టూ ఉన్న కట్టడాలు, నివాసాలన్నీ మునిగిపోతాయి. నదీగర్భంలో చొచ్చుకుని ఉన్నందువల్లే బాబు ఉంటున్న లింగమనేని గెస్టుహౌజ్ సగందాకా మునిగిపోయింది. నదికి వరద వచ్చినప్పుడు ఈ అక్రమ బిల్డింగులన్నీ ప్రవాహాన్ని ఆపడం వల్ల ఒత్తిడి పెరిగి కరకట్టకు గండి పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి బ్యారేజీకి కూడా నష్టం కలగచ్చు కూడా. అందుకే ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లూ ఎత్తి వరద నీటిని కిందికి వదిలారు. 
ఇదిలా ఉంటే...ఒక్క చంద్రబాబు ఇంటిని ముంచడానికే ప్రకాశం బ్యారేజీ గేట్లు ఆలస్యంగా ఎత్తారంటూ పచ్చమూక పిచ్చికూతలు కూస్తోంది. అసలు నీరు వదలడానికి ఓ పద్ధతి ఉంటుందన్న సంగతి కూడా తెలియని అయోమయం బ్యాచ్ పుట్టిస్తున్న ప్రచారం వారి అజ్ఞానాన్ని బయటపెడుతోంది. ఇరిగేషన్ సిస్టం గురించి కనీస జ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. 
వరదలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఇంజనీర్లు, వర్కు ఇన్సిపెక్టర్లు, AE, DE, EE, CE, RE ఇలా ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు. వరద ఉధృతి అంచనా మొదలు, డ్యాంలో ఎంత నీరు నిల్వ ఉంచాలి, ఎంత వదలాలి, ఎప్పుడు వదలాలి, ముంపు ప్రమాదం ఎక్కడుంది, ఏ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాలి వంటి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ పని చేస్తుంటారు. అంతేగానీ చంద్రబాబు అక్రమ నివాసం ఒక్కదాన్ని ముంచడం కోసం వేలాది మంది ప్రాణాలను ఎవ్వరూ పణంగా పెట్టరు, పెట్టలేరు. నదీపరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి కట్టిన లింగమనేని గెస్టు హౌసును కూల్చాల్సింది పోయి, అందులో చంద్రబాబు నివాసం ఉండటమే అతి పెద్ద నేరం. ఇక బాబును ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు నదిని ఆక్రమించి, లోలపకి చొచ్చుకు వచ్చి అక్రమ నిర్మాణాలు, చేపల చెరువుల పెంపకాలు కూడా చేసారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణతీరంలో ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని ఆనాడే వైఎస్ జగన్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రజావేదికను కూల్చి, చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. వరద సమయాల్లో ఇలా ముంపు ముప్పు ఉంటుందనే నాడు వైఎస్ జగన్ చంద్రబాబును అక్రమ నివాసాన్ని ఖాళీ చేయమని చెప్పారు. దీన్ని ఓ కక్ష సాధింపు చర్యగా ప్రచారం చేసుకున్న తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చూడబోతే వరద నీటిలో మునిగింది బాబు ఇల్లే కాదు తెలుగుదేశం తెలివి, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం కూడా అనిపిస్తోంది. 
 

Back to Top