గుడివాడ: రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో లే–అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. మరో రూ.4,626 కోట్లను సబ్సిడీ గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 20 ఏళ్లపాటు నెలకు రూ.3 వేల చొప్పున అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి. అంటే నిరుపేదలు చెల్లించాల్సిన అక్షరాల రూ.10,339 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 365 చ.అ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 74,312 మంది 430 చ.అ. లబ్దిదారులకు రూ.50 వేల చొప్పున ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా జగనన్న ప్రభుత్వమే భరించడంతోపాటు మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా ఇచ్చింది. ఉచితంగా రిజిస్ట్రేషన్ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లు ప్రతిపాదించిన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యంగా వదిలేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాకే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. దీంతో ఒక్కో లబ్దిదారుడికి అదనంగా మరో రూ.60 వేల వరకు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు సబ్సిడీ రూపంలో రూ.11,672 కోట్లు, ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ.482 కోట్లు, ఉచిత రిజి్రస్టేషన్ల రూపంలో రూ.1,200 కోట్లు, మౌలిక వసతులకు మరో రూ.3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ.16,601 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. రూ.657 కోట్లతో 13,145 ఇళ్ల పట్టాలు గుడివాడ నియోజకవర్గంలో 84 వైయస్ఆర్ –జగనన్న లేఅవుట్లలో రూ.657 కోట్ల విలువైన 13,145 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల కింద రూ.239 కోట్లు విలువైన 8,859 ఇళ్లు మంజూరు చేసింది. మౌలిక వసతులకు మరో రూ.87 కోట్లు వెచ్చించింది. గుడివాడలో రూ.983 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులకు ఖర్చు చేసింది. లక్షల ఇళ్ల పంపిణీ సీఎం వైయస్ జగన్‌కే సాధ్యం: టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప సాహసం మన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారని, లక్షల మందికి ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయించడం పేదల ప్రగతి పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం తుళ్లూరులో రెండోవిడతగా మూడువేల మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సీఎం వైయస్ జగన్ మొక్కవోని దీక్షతో పేదప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పారు. న్యాయపరమైన సమస్యలను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్లస్థలాలు కేటాయించారన్నారు. ఇన్ని వేలమందికి ఇంటిపత్రాలు ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసమని పేర్కొన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. అంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని ఆయన పేర్కొన్నారు.