గుంటూరు అభివృద్ధికి అందరి భాగస్వామ్యం.. ప్రజల సంక్షేమమే లక్ష్యం

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు: గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి గుంటూరులోని మార్వాడీ సంఘం పెద్దలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, వివిధ వర్గాలతో సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో మార్వాడీ సంఘం ప్రముఖులు శ్రీదేవికి తమ మద్దతు ప్రకటించారు.

ఈ సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, గుంటూరు మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు రత్నాకర్‌, మార్వాడీ సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. పరస్పర సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, నగర అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం కీలకమనే అంశంపై ఈ ఆత్మీయ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.

Back to Top