చిత్తశుద్ది లేని శివపూజ లేల? దక్షత లేని దీక్ష లేలా?

ప్రత్యేకహోదా ఏంటి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే చప్పట్లు కొట్టి స్వాగతించారు

ప్రత్యేకహోదా కోసం నినదించిన వారి పీకలు పిసకతానన్నంతగా కోప్పడ్డారు

బీజేపిని వదిలేశాక, కాంగ్రెస్‌ చెయ్యిపట్టుకున్న చంద్రబాబు

మొసలి కన్నీళ్లు కారుస్తున్న బాబును చూసి నవ్వాలో...ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి

అమ‌రావ‌తి: చేతిలో మాలలోని రుద్రాక్షలు తిప్పుతూనే వుంటాయి. ఓం నమశ్శివాయ అంటూనే వుంటారు. మనసు మాత్రం పరిపరి విధాల చక్రాలు కొడుతుంటుంది. కోరికల లెక్కలేసుకుంటూ వుంటుంది. అలాంటి చిత్తశుద్దిలేని పూజలైనా...ఏదైనా పేరు చెప్పుకుని కూర్చునే దీక్షలైనా ఒకటే. 
ఢిల్లీలో శ్రీమాన్‌ చంద్రబాబుగారి ధర్మపోరాట దీక్షనే తీసుకుందాం. అదెందుకయ్యా అంటే, ప్రత్యేకహోదా ఇవ్వని, విభజన హామీలు నెరవేర్చని మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకట. దాదాపు నిన్నామొన్నటి దాకా బీజేపితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి, మోడీగారిని నెత్తినెత్తుకున్నంత పనిచేసి..బాబు, నీకేంటి, మై హూనా...ప్రత్యేకహోదా ఏంటి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే చప్పట్లు కొట్టి స్వాగతించింది చంద్రబాబుగారే. కనీసం అప్పుడైనా, సారీ మోడీజీ...మాకిచ్చిన హామీ ప్రత్యేకహోదా. మా ప్రజలు బలంగా కోరుకుంటున్నదీ అదే. అన్నిటికీ మించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనది అన్నారా? అంటే ఏదీ అనలేదు. ఒక్కసారైనా అలా అన్న పుణ్యాన్ని మూటకట్టుకోలేకపోయారు బాబుగారు. అది చాలదన్నట్టు...ప్రత్యేకహోదా కోసం నినదించిన వారి పీకలు పిసకతానన్నంతగా కోప్పడ్డారు. ఇక ఆయన వారసుడు చిన్నశ్రీమాన్‌ లోకేష్‌గారైతే, ప్రత్యేకహోదాతో కంపెనీలు వచ్చేస్తాయి. హాయిగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్‌ చేయాలన్నది జగన్‌గారి తాపత్రయమని...ఎక్కడా ఎవరికీ లేని మేధావితనంతో...ఇల్లాజికల్‌గా మాట్లాడేశాడు. 
మోడీగారు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్నాడు. అదీ మామూలు విషయం కాదు. దాని ముందు ప్రత్యేక హోదా మాటెంత...అని నిన్నటి దాకా దబాయించిన బాబుగారు ఇప్పుడెందుకు ఇలా యూటర్న్‌ బాబయ్యారు? ఎందుకంటే...విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. బాబు రాజకీయం తెలిసిన వారందరికీ అర్థమయ్యే వుంటుంది. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని అసెంబ్లీ సాక్షిగా గుడ్లురిమిన చంద్రబాబు గారు...ఇప్పుడు ఢిల్లీలో దీక్ష పేరిట చేస్తున్న యాగీ అంతా రాజకీయప్రయోజనం కోసమే కానీ మరెందుకు కాదు గాక కాదు. ప్రత్యేకహోదా విషయంలో ఏమాత్రం చిత్త శుద్దిలేని మనిషి, ఇప్పుడు మాత్రం ఎవరికీ లేని దక్షతా తనకే వున్నట్టు...తానే ప్రత్యేక హోదా సాధించేది అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నవ్విపోదురు గాక...నాకేటి సిగ్గన్నది ...పస్ట్‌ నుంచి బాబుగారి నేచరే మరి!! అయన్నుంచి మరో తీరులో దక్షత కలిగిన నాయకత్వాన్ని ఆశించలేం కదా?!
విపక్షనేతగా, తన బాధ్యతను ఏమాత్రం మరవకుండా... ప్రత్యేకహోదా గురించి పదే పదే గుర్తు చేస్తున్న వైఎస్‌ జగన్‌ మాటను ఏమాత్రం పట్టించుకోని, అధికారపక్షానికి..ఇప్పుడేమో ప్రత్యేకహోదా సాధించాలన్న పట్టుదల మాదే అని గొప్పగా చెప్పుకోవడం ఎట్లా సా«ధ్యమైంది. అంతకు ముందు వైయస్‌ జగన్‌ ప్రత్యేకహోదాపై చేయని పోరాటం లేదు. దీక్ష లేదు. అంతేకాదు ప్రతీ సారీ రాష్ట్రవిభజన తర్వాత ప్రత్యేకహోదా విషయంలోనూ, విభజన హామీల నెరవేర్చడంలోనూ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోడీగారి ప్రభుత్వం, అంతకు ముందు విభజించిన కాంగ్రెస్‌ పార్టీ ..ప్రత్యేకహోదాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణ బిల్లులో ఆ అంశాన్ని చేర్చని కాంగ్రెస్‌ పార్టీతో సహా, చంద్రబాబుగారు, ఆయనకు ఎన్నికల వేళ వంతపాడిన జనసేననాయకుడు...ఇలా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేశాయి. అలాంటి ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోం మేమని వై.యస్‌.జగన్‌ పదేపదే చెబుతున్నా, తనవైన కుయుక్తులతో చంద్రబాబుగారు మరో తీరులో ప్రచారం చేస్తున్నారు. రాజకీయప్రయోజనాల కోసం, ఎవరో ఒకరు తోడులేకుంటే నడవలేనితనంతో బీజేపిని వదిలేశాక, కాంగ్రెస్‌ చెయ్యిపట్టుకున్న చంద్రబాబుగారు..ఎట్లాగూ టీడీపి సిద్దాంతాన్ని విసిరి అవతల పడేశారు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుండే సరికి, తన చర్యను సమర్థించుకోలేక, నా మాట పక్కన పెట్టండి...అదిగదిగో అక్కడ చూడండి, ఆ జగన్‌రెడ్డి, మోడీతో జత కడుతున్నాడు. ఆయనకు తోడు పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. వాళ్లు ఆం«ధ్రప్రదేశ్‌ అభివృద్ది కాదు కావల్సింది. నామీద కక్ష సాధింపే లక్ష్యమయింది. మోడీని నమ్మి మోసపోయిన అమాయకుడిని...(బాబుగారు మిమ్మల్ని నమ్మి ప్రజలు మోసపోయినట్టుగా అని అనాలనుకుంటున్నారా? చదువరులూ...), నిప్పులాంటి నిజాయితీ పరుడిని, చేతికి వాచీ, ఉంగరం కూడా లేదు, గాంధీగారిలా నిరాడంబరంగా జీవిస్తున్నవాడిని...అని మొసలికన్నీళ్లు కారుస్తున్న బాబుగారిని  చూసి నవ్వాలో...ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రజలది. 
చేయాల్సిన పాపాలన్నీ చేసేసి...పుణ్యం మూటగట్టి ఇవ్వండి అని ఏడ్చే బాబుగారి...కొందజపాల్ని, దొంగదీక్షల్ని నమ్మితే...నట్టేట మునిగినట్టే...తస్మాత్‌ జాగ్రత్త. 
పి.యస్ః
రంగుల దుస్తులేసుకోవడం తెలీని నేను ఈ రోజు నల్లరంగు షర్టు వేసుకున్నానంటే అది మీకోసమేనని చంద్రబాబుగారు అంటున్నారు. పాపం ప్రజలకోసం చంద్రబాబు చేస్తున్న చిన్నాచితకా త్యాగాలకు లెక్కే లేకుండా పోతోంది. ఏది ఏమైనా...నల్లచొక్కాతో...తనలోని అసలు చీకటి కోణాన్ని ఆవిష్కరించుకున్నారు నారావారు. 

తాజా ఫోటోలు

Back to Top