బీసీలపై బాబు కపట ప్రేమ

 నారా వారి పాలనలో బీసీలకు జరిగిన మేలు ఎంత?

తోక కత్తరిస్తా..తాట తీస్తానంటూ దూషించింది నీవు కాదా బాబూ

అమరావతి: నారా చంద్రబాబు నాయుడికి వెనుకబడిన తరగతులు(బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌) అంటే మొదటి నుంచి కూడా ద్వేషమే.  బీసీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు కాని..వారికి చేసిన మేలు ఏమీ లేదు. ఎన్నికలప్పుడు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, మూడు గడ్డపారలు ఇచ్చి అదే బీసీలపై ప్రేమ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు  బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని చెప్పిన దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ చర్యలను బట్టి చంద్రబాబు ఎంత బీసీ వ్యతిరేకో అందరికీ తెలుసు. బీసీలకు వ్యక్తిత్వం, క్యారెక్టర్‌ ఉండదు అని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి. న్యాయం చేయాలని అడగడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారులను తాట తీస్తానని దూషిస్తూ చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని నీచంగా మాట్లాడారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడులతో కూడా బీసీలను అవమానించేలా మాట్లాడించారు.  2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన అంశాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? బీసీ కులాల ప్రజలు, సంచార జాతుల వారి జీవన స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయి. సంచార జాతుల వారికి వారి కులం పేరు కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది.   బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదే. గడచినా ఐదేళ్ల పాలనా కాలంలో బీసీలకు కేవలం రూ.18వేల కోట్లు ఖర్చుపెట్టారు.   దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు.  ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు.  దీన్నిబట్టి చూస్తే బీసీలు టీడీపీకి ఓటు బ్యాంకుగానే ఉపయోగపడ్డారు తప్ప..వారికి చంద్రబాబు చేసిన మేలు  ఏమీ లేదు.
  
Read Also: ‘ఇకపై ఆ దోమలకు కష్టకాలమే’

తాజా ఫోటోలు

Back to Top