‘ఇకపై ఆ దోమలకు కష్టకాలమే’

అమరావతి: ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్ర చేస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా వారిపై విమర్శణాస్త్రాలు సంధించారు. ‘నిత్య కల్యాణం’ గురించి సోషల్‌ మీడియాలో ఏమనుకుంటున్నారంటే.. సీజన్‌లో వచ్చిపోయే డెంగీ, చికెన్‌ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే’ అని ట్వీట్‌ చేశారు.
ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు..
చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువుపై దీక్ష చేయాల్సివస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని ట్వీట్‌ చేశారు.  

Read Also: మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం

తాజా ఫోటోలు

Back to Top