వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా శ్రీకృష్ణదేవరాయలు జ‌యంతి వేడుక‌లు

వైయ‌స్ఆర్ జిల్లా:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు కె. సురేష్ బాబు ,కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, ఉపమేయర్ నిత్యానంద రెడ్డి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను పార్టీ నాయ‌కులు కొనియాడారు. కార్య‌క్ర‌మంలో క‌డ‌ప కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, కాపు సంఘం నాయకులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సంస్కృతి, సాహిత్యాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించారు.

చిత్తూరులో..
చిత్తూరు న‌గ‌రంలోని గంగినేని చెరువు వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి చిత్తూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి, త‌దిత‌రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై మహారాజు సేవలను కొనియాడారు. తెలుగు వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.


 

Back to Top