ఐలాపురం వెంకయ్య మృతిపై వైయ‌స్ జగన్ దిగ్ర్భాంతి 

తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  ఐలాపురం వెంకయ్య  ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. 

వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.

 

Back to Top