పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు జాతీయ రహదారిలో దువ్వ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడటంతో పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు ముప్పు లేకుండా త్వరితగతిన చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. తదనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులకు అవసరమైన సహాయం అందేలా అధికారులతో మాట్లాడారు. ఆయన మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడంతో స్థానికులు ఆయన్ను ప్రశంసించారు.