రాష్ట్రమంతా వైయస్సార్ కుటుంబమే

టిడిపి ప్రభుత్వానికి పాస్ మార్కులు కూడా రావంటున్న నేతలు
వైయస్సార్ కుటుంబంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు
యువనేత వాయిస్ కాల్ కు పెద్ద ఎత్తున స్పందన
ఇంటింటికీ వచ్చి వైయస్సార్ కుటుంబంలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంటుందన్న గ్రామ వాసులు
ప్రతి గడపలోనే కాదు, గుండెలోనూ వైయస్సే ఉన్నాడంటున్న అభిమానులు

వైయస్సార్ కుటుంబం కార్యక్రమం ఈరోజు మొదలు కానుంది. బూత్ లెవల్ సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు
పూర్తి అయ్యాయి. వైయస్సార్సిపి బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని వైయస్సార్ కుటుంబ
సభ్యులు గా చేర్చడానికి సన్నద్ధం అవుతున్నారు. 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామ
స్థాయి కార్యకర్త నుంచి, నాయకుల వరకూ వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో తమ వంతు పాత్రపోషిస్తారు.
ప్రజా సమస్యలను వారి ముంగిట్లోకి వెళ్లి చర్చిస్తారు. ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల స్పందనను అడిగి
తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తారు. అర్హులైన వారికి చేరని
పథకాలను అందించేందుకు కృషి చేస్తారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ నేతగా వైయస్ఆర్ సిపి అధ్యక్షుడు
జగన్ మోహన్ రెడ్డి వైయస్ ఆర్ కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11వ తేదీ నుండి
వచ్చేనెల 2 వ తేదీ వరకూ వైయస్సార్ కుటుంబం కార్యక్రమం ఊరూరూ జరగనుంది.
టిడిపి పాలనపై ప్రశ్నాపత్రం
విద్యార్థులు బాగా చదివారో లేదో తెలియజేయడానికి పరీక్షలుంటాయి. వారి చదువుకు కొలమానంగా ఆ పరీక్షా
ఫలితాలుంటాయి. అలాగే ప్రభుత్వాల పని తీరుపై కూడా పరీక్షలుండాలి. అలాంటి బృహత్తర ప్రయత్నం

చేపట్టారు యువనేత జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం టిడిపి పాలనకు ప్రజలు వేసే మార్కులు ఎన్నో
ప్రభుత్వానికే తెలియజెప్పబోతున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల స్పందనే ఆ పరీక్షా ఫలితం. ప్రతి గ్రామంలోనూ
సుమారు 10మంది వైయ్సార్ సిపి బూత్ కమిటీ సభ్యులు ఉంటే ఒక్కొక్కరూ రోజుకు కనీసం రెండు ఇళ్లను
సందర్శిస్తారు. అరగంటపాటు ఆ ఇంటి సభ్యులతో మాట్లాడతారు. మూడున్నరేళ్ల టిడిపి పాలనకు సంబంధించి
100 ప్రశ్నలకు వారితోనే మార్కులు వేయిస్తారు. చంద్రబాబు హామీలు నెరవేర్చారా? వారి పాలనలో మీకు
కలిగిన అసంతృప్తులు ఏమిటి? చంద్రబాబు చేసే పనులతో వారు ఏకీభవిస్తున్నారా? లేదా? ఇలాంటి వాటికి
సమాధానాలన్నీ ఈ ప్రశ్నాపత్రంతో దొరుకుతాయి. అసలు మూడున్నరేళ్ల బాబు పాలనకు ప్రజలు వేసే
మార్కులు ఎన్నో తేలనున్నాయి.
అర్హులకు పథకాలు చేరుతున్నాయా?
వృద్ధాప్య, వితంతు పింఛను, రేషను, నిరుద్యోగభృతి, రుణమాఫీ, ఇళ్ల మంజూరు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్
మెంట్ వంటి సంక్షేమ పథకాలు చాలామందికి అందటం లేదని ఎన్నో సందర్భాల్లో ప్రజలు ప్రతిపక్ష నేత వద్ద
వాపోతున్నారు. జన్మభూమి కమిటీలు కూడా తమ సామాజిక వర్గానికో, టిడిపి అనుకూలురకు మాత్రమే ఈ
పథకాలను ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయని ఆవేదన చెందారు. ఇవన్నీ చూసిన ప్రతిపక్ష నేత ఇంటింటా
అర్హులైన వారికి పథకాలు వర్తిస్తున్నాయో లేదో తెలుసుకుని, వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకు వైయస్ఆర్ కుటుంబం వేదిక కావాలని భావించారు. వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో బూత్
కమిటి సభ్యులు వచ్చినప్పుడు అర్హత ఉండి పథకాలు అందటం లేదని తెలిస్తే వారికి నాయకులు సహాయం
చేస్తారు. వారి సమస్యల పరిష్కారానికి వైయస్సార్ సిపి నేతలు కృషి చేస్తారు.

వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యం
కష్టాల్లో ఉన్నవారికి వద్దకు కదిలి వచ్చిన వైయస్సార్ ను గుర్తు చేసేలా ఆయన వారసుడు జగన్
కార్యక్రమాలు ఉంటున్నాయని ఊరూరా ప్రజలు అనుకుంటున్నారు. సంక్షేమ పాలకుడిగా, రైతు
బాంధవుడిగా, పేదవాడి ఇంటికి పండుగ తెచ్చిన వైయస్సార్ ఆశయాలకు వైయస్ జగన్ నిలువెత్తు రూపంలా

ఉన్నాడని అభిమానులు సంబరపడుతున్నారు. వారందరినే కాదు, రాష్ట్రమంతా వైయస్ఆర్ కుటుంబమే అని
తెలియజెప్పేలా వైయస్సార్ కుటుంబంలో సభ్యత్వం నమోదు కోసం 9121091210 కి మిస్డ్ కాల్ ఇప్పించడం
జరుగుతుంది. వెంటనే ఆ నెంబర్ నుండి యువనేత గళం వినిపిస్తుంది. వైయస్సార్ కుటుంబంలో చేరినందుకు
అభినందనలు తెలుపుతూ, మీకోసం వెన్నంటి ఉంటాననే జగనన్న వాయిస్ కాల్ వస్తుంది. వైయస్సార్ సిపి
పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సందేశం సంక్షిప్త వాయిస్ మెసేజ్ గా ఆ కుటుంబానికి
అందుతుంది.
స్వర్ణయుగాన్ని తలుచుకుంటూ
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల గురించి, ఆయన పాలన
స్వర్ణయుగంలా ఎలా గడిచిందో వైయస్ ఆర్ కుటుంబం కార్యక్రమంలో కార్యకర్తలు ఇంటింటా వివరిస్తారు.
అందరి ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి కూడా
తెలియజేస్తారు. సంక్షేమ పాలన కావాలంటే వైయస్ జగన్ రావాలనే ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ
వైయస్ఆర్ కుటుంబం.
వైయస్సార్ సిపి నేతల మాట
టిడిపి ఆరాచక పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు వైయస్సార్ సిపి స్థానిక
నేతలు. ఉప ఎన్నికల ఫలితాలు చూసి అవే మార్కులను భ్రమపడకూడదని అవి కేవలం స్లిప్ టెస్టులు
లాంటివని అంటున్నారు. అసలైన పరీక్షలు ముందుంటాయని, అవే ప్రభుత్వం పాసో ఫెయిలో తేల్చేస్తాయని
కూడా నాయకులు అభిప్రాయ పడ్డారు.
Back to Top