చంద్రబాబు ఆ పని ఎందుకు చేయటం లేదు..!


ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల గారడీ చేయటంలో అందె వేసిన చేయి. అందుకే మాటలతో
కోటలు కడుతూ ప్రజల్ని అదే భ్రమలో ఉంచుతారు. ఇందుకోసం పచ్చ మీడియా ను కూడా అదే
దారిలో ఉపయోగించుకొంటారు.

అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయినా.. చంద్రబాబు ఏ విషయంలోనూ ఎక్కడా
స్పష్టత ఇవ్వటం లేదు. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ తో కలిసి ప్రచారం నిర్వహించారు.
తమది విన్నింగ్ పెయిర్ అని, కేంద్రం నుంచి తాము ఎన్నెన్నో నిధులు రాబడతామని హామీలు
గుప్పించారు. కానీ, పదవిలోకి వచ్చాక మాత్రం ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడ లేదు.

కేంద్రం ఇస్తున్న నిధులు ఎన్ని, వాటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు అనే
విషయంలో గోప్యత పాటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా
ప్రకటించిన .. దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకొంది. ఇందుకు అనుగుణంగా
నిధులు కేటాయిస్తోంది. కానీ, చంద్రబాబు మాత్రం పదే పదే పోలవరాన్ని
కడతాం..పోలవరాన్ని పూర్తి చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నారు. అసలు కేంద్ర
ప్రభుత్వ ప్రాజెక్టులో చంద్రబాబు స్వయంగా చేస్తున్నది ఏమిటనేది బయటకు రావటం లేదు.

విభజన చట్టం ప్రకారం కొత్త రాజధాని ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం చొరవ
తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను నియమించటం తో పాటుగా నిధులు
మంజూరు చేస్తూ వచ్చింది. దాదాపు రూ. 18 వందల కోట్ల రూపాయిలకు పైగా నిధులు
రాష్ట్రానికి వచ్చేశాయి. వీటిని  ఏం
చేశారు.. పోనీ, ఇంత మేర నిధులు వచ్చాయి, మరిన్ని వస్తాయి అని కూడా ఎక్కడ చెప్పటం
లేదు. రాజధానిని కట్టి చూపిస్తా అని ప్రకటనలు చేస్తున్నారు.

ప్రతీ జిల్లాలోనూ జాతీయ విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు తెస్తున్నట్లు
ప్రకటనలు చేస్తున్నారు. కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. అటువంటప్పుడు
కేంద్రం నుంచి వస్తున్న నిధులు కానీ, సహాయం గురించి కానీ ఎక్కడ బయటకు చెప్పటం
లేదు.

వరదలు, కరవు వంటి విపత్తులు విరుచుకు పడినప్పుడల్లా కేంద్రం నుంచి నిధులు
వస్తుంటాయి కానీ అవేమీ బయటకు వెల్లడి కావటం లేదు. ప్రతీది తన స్వయంక్రత్యం గా
చంద్రబాబు ఉత్సవాలు కూడా జరిపిస్తుంటారు.

అసలు ఇప్పటి దాకా కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు వస్తున్నాయి. ఎంత మేర ఖర్చు
పెడుతున్నారు. ఏ ఏ పథకాలకు వినియోగిస్తున్నారు అనే వివరాలు మాత్రం బయటకు
పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే చంద్రబాబు ఏం చేసినా కోటరీ మనుషులకు తప్ప
కొన్ని సార్లు సంబంధిత మంత్రులకు కూడా తెలియనివ్వరు. 

Back to Top