చంద్రబాబు దౌర్జన్యంపై ప్రజాగ్రహం..!

పచ్చనేతలకు వైఎస్ జగన్ ఫియర్..!
ప్రజాధారణ చూసి ఓర్వలేక కుట్రలు..!
బలవంతంగా దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లు నిలిపివేత..!

గుంటూరుః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే ప్రభుత్వ నేతల వెన్నులో వణుకుపుడుతోంది. ప్రత్యేకహోదా సాధన కోసం గుంటూరులో ఈనెల 26 నుంచి వైఎస్ జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను అడ్డుకునేందుకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. ఉల్ఫ్ హాల్  గ్రౌండ్ వద్ద చంద్రబాబు డైరెక్షన్ లో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. బలవంతంగా ఏర్పాట్లు నిలిపివేశారు. పెద్ద ఎత్తున దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

చంద్రబాబు దౌర్జన్యంపై ప్రజాగ్రహం..!
ప్రత్యేకహోదా కోసం ఉద్యమించాల్సిందిపోయి...పోరాడుతున్న ప్రతిపక్షనేతను అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్రలు చేయడం దారుణం. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైఎస్ జగన్ దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 

పచ్చనేతలకు ముచ్చెమటలు..!
యువభేరి సక్సెస్ తో పచ్చనేతల గుండెలు గుభేల్ మన్నాయి.  వైఎస్ జగన్ కు మద్దతుగా కదంతొక్కిన విద్యార్థిలాకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో, జననేత జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక... దీక్షపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్నీ అనుమతులు తీసుకొని ఏర్పాట్లన్నీ పుర్తి చేసుకున్న సమయంలో ట్రాఫిక్ సాకుతో చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పి కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నారు. 

ఆరునూరైనా దీక్ష జరిగితీరుతుంది..!
చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలు చీధరించుకుంటున్నారు. ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేస్తుంటే సమర్థించాల్సిందిపోయి ఆటంకాలు సృష్టించడంపై మండిపడుతున్నారు. దీక్షను అడ్డుకుంటున్న తీరు చూస్తే చంద్రబాబు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమని తేలిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా వైఎస్ జగన్ దీక్షను ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కు మద్దతుగా ప్రత్యేకహోదాపై గర్జిస్తామన్నారు. ఆరునూరైనా దీక్ష జరిగి తీరుతుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదాను సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 

Back to Top