చంద్ర‌బాబు పాల‌నా..మ‌జాకానా...!హైద‌రాబాద్‌) ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు త‌న‌దైన మార్కు పాల‌న సాగిస్తున్నారు. నియ‌మ నిబంధ‌నల్ని ఏ ర‌కంగా తుంగ‌లోకి తొక్కి అయిన వాళ్ల‌కు అన్నీ వ‌డ్డించుకోవాలి అనేది ఆయ‌న‌కు తెలిసిన‌ట్లుగా వేరే వారికి తెలియ‌దు అనే అనుకోవాలి. తాజాగా హంద్రీ నీవా ప‌నుల విష‌యంలో ఇది బ‌య‌ట ప‌డింది.

హంద్రీ నీవా సుజ‌ల స్ర‌వంతి అన్న‌ది రాయ‌ల సీమ‌లోని అనేక మండ‌లాల‌కు సాగునీరు అందించే ఒక ముఖ్య‌మైన ప‌థ‌కం. ఇందులో చాలా వ‌ర‌కు దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలోనే పూర్తి అయ్యాయి. మిగిలిన ప‌నుల విష‌యంలో కాంట్రాక్టు పొందిన సంస్థ‌ను ప‌క్క‌న పెట్టి, త‌మ సంస్థ‌ల‌కు ప‌నులు అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు త‌ర‌పున ఆయ‌న‌కు స‌న్నిహితుడు అని పేరు తెచ్చుకొన్న ఒక ఎంపీ సోద‌రుడు రంగంలోకి దిగారు. ప‌నుల నాణ్య‌త‌ను వంక‌గా చూపించి నాలుగు కొత్త సంస్థ‌ల‌కు ప‌నుల్ని కేటాయించేలా చ‌క్రం తిప్పారు. ఇంత‌కు ముందు ఉన్న‌రేట్ల‌కే ఈ ప‌నుల్ని అప్ప‌గించిన‌ట్లుగా చెప్పిస్తున్నారు. అయితే ఇది ఎంత వ‌రకు సాధ్యం అవుతుంది, చివ‌ర‌కు బిల్లుల మంజూరు స‌మ‌యంలో ఎటువంటి తేడాలు వ‌స్తాయి అనే దాని మీద మాత్రం త‌క‌రారు నెల‌కొంది. ఈ ఖ‌ర్చుల వ‌ర‌కు మాత్రం అవ‌స‌రం అయితే, పాత సంస్థ నుంచి రాబ‌ట్టేయోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

మొత్తం మీద ప‌నులు ద‌క్కించుకొన్న నాలుగుసంస్థ‌లుకూడా తెలుగుదేశం అనుకూల వ‌ర్గీయుల‌వి కావ‌టం విశేషం. ఇందుకోసం రాయ‌ల‌సీమ‌కు చెందిన స‌ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యుడి సోద‌రుడు తిరుప‌తి ఎస్ ఇ కార్యాల‌యం ద్వారా చ‌క్రం తిప్పార‌ని చెప్పుకొంటున్నారు. 
Back to Top