<br/><br/>అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాడే పార్టీ. అందుకే రాష్ట్రం నలుమూలలా ఆ పార్టీకీ, పార్టీ అధినేతకూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం నిరంతర శ్రామికునిలా పనిచేసే వైయస్ జగన్ వెంటే అడుగులు వేస్తున్నారు వైయస్ఆర్‌సీపీ నాయకులు. ప్రజా సమస్యల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడంలోనూ, అధికారపక్ష నాయకుల అక్రమాలను నిలదీయడంలో, ప్రజా సమస్యలపై గళమెత్తడంలోనూ వైయస్ఆర్‌సీపీ నాయకులు ముందుంటున్నారు. నెల్లూరుకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మురుగు నీటిలోకి దిగి నిరసన తెలిపారు. మురుగు కాలవపై వంతన నిర్మించాలని స్థానికులు కోరుతుంటే సరేనంటూ నాలుగేళ్లుగా కాలయాపన చేస్తున్నమున్సిపల్ అధికారులపై కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. అధికారులతో పనిచేయించడానికి, ప్రజా సమస్యను పరిష్కరించడానికి ఆయనే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి నిరసన తెలుపడంతో అధికారులు కూడా దిగివచ్చారు. ఇరిగేషన్ అధికారులతో 45 రోజుల్లో పని పూర్తి చేస్తామన్న హామీ పుచ్చుకున్నాకే ఎమ్మెల్యే డ్రైనీజీ నీటిలోంచి బయటకు వచ్చారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ తీరంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కిన తెలుగు మత్స్యకారులను విడిపించేందుకు రాయబార కార్యాలయంతో మాట్లాడతానని, బందీలను తిరిగి తీసుకువస్తామని వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు విదేశాల్లో కన్వీనర్లు పనిచేస్తున్నవారు, పార్టీ అభిమానులుసైతం మానవత్వాన్ని చాటుకునే మంచి పనుల్లో ముందుంటారు. గల్ఫ్ లో ఉన్న వైయస్ఆర్‌సీపీ కన్వీనర్లు కువైట్ లో చిక్కుకున్న బాధితులకు రాష్ట్రానికి పంపించేందుకు సాయం అందించారు. ఎంబసీతో సంప్రదించి, విమాన టిక్కట్లు ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితులను స్వస్థలాలకు చేర్చారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా నిలిచింది ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక సాయాన్ని అందించి, వారికి మనోధైర్యాన్ని కలిగించింది. తిత్లీ తుఫాను, కేరళ వరదలప్పుడు తక్షణం స్పందించి, సహాయంగా పెద్ద మొత్తంలో నిధులు, ఇతర సామగ్రి పంపి తన పెద్దమనసును చాటుకున్నారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలపట్ల ఉండే నిబద్ధతే ఆ పార్టీ అలా స్పందించేలా చేస్తోంది. ఆ నాయకుడి సంకల్పమే అనుచరుల లక్ష్యంగా రూపుదిద్దుకుంటోంది. ప్రజా సమస్యలపై స్పందిచే ఆ గుణమే నేడు రాష్ట్రమంతా వైయస్ఆర్‌సీపీ జెండా ఎగిరేలా చేస్తోంది. అధికారం లేకున్నా ప్రజలపై అభిమానం, బాధ్యత ఉన్న నాయకులను వైయస్ఆర్‌సీపీలోనే చూస్తున్నాం అంటున్నారు తెలుగు ప్రజలు. గద్దెనెక్కించిన వాళ్లు ప్రజలకు పంగనామాలు పెడుతుంటే, ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రజా పక్షాన నిలబడుతున్నారని అంటున్నారు.