బాబు పాలనలో ప్రజలు బలి@2016

– 2016లో సామాన్య ప్రజలు, మహిళలు, అధికారులపై పెరిగిన దాడులు
– అవినీతిలో, దళితులపై దాడుల్లో ఏపీ టాప్‌
– అవినీతి సీఎంగా బాబుకు నం.1 స్థానం
– ప్రారంభోత్సవాలతో వేల కోట్ల ప్రజాధనం వృథా
– ప్రజలను అప్పుల్లోకి నెడుతున్న ఏపీ సీఎం
– గడిచిన ఏడాదిలో బాబు అరాచకాలపై తేదీలతో సహా స్పెషల్‌ స్టోరీ

చెప్పిందొకటి.. చే సిందొకటి

1. జాబు రావాలంటే బాబు రావాలి. ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా. నెలకు 2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తా.
– నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు. శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పాం. 

2. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సభలో బెల్టు షాపులను రద్దు చేస్తూ నాలుగో సంతకం.
– బార్‌ పార్లర్స్‌ ఏర్పాటుకు ప్రత్యేక జీవో. అన్నం దొరికే ప్రతిచోటా మద్యం అందుబాటులోకి తేవాలని అధికారులకు ఉత్తర్వులు. తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్ల్లవుతారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగింది. అయ్యప్ప భక్తుల కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతోంది.

3. ఆడపడుచులకు అండగా ఉంటా. 
– తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి కేసు లేదు.
– అనకాపల్లిలో బైకుపై వెళ్తున్న దంపతులను కారుతో ఢీకొట్టిన టీడీపీ నాయకుడి కుమారుడి తరఫున సెటిల్మెంట్‌.
– ఈవ్‌టీజింగ్‌ భూతానికి నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య.. నిందితులపై కేసు లేదు. పరారీలో ప్రొఫెసర్‌
– గుంటూరు మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ లక్షి వేధింపులకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్య. ప్రతిపక్ష నేత ఒత్తిడితో ప్రొఫెసర్‌ అరెస్టు.. బెయిల్‌పై విడుదల
– కర్నూలులోని ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌ వేధింపులకు బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య. రెండో రోజే వార్త కనుమరుగు. 

4. నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజా సేవకే అంకితం. 
– బినామీలకు అడ్డగోలుగా భూములు కేటాయింపు.. పొలాలు ఇవ్వమని ఎదురుతిరిగిన రైతుల పంటలకు నిప్పు..

5. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని.. పదేళ్లు ఇక్కడే ఉంటా. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెచ్చేదాకా హైదరాబాద్‌ను వీడే ప్రసక్తే లేదు. (ఓటుకు నోటు కేసులో ఇరుక్కోక ముందు)
– ఏపీకి రాజధాని అవసరం. అమరావతిని అంతర్జాతీయ రాజ«ధానిగా మలుస్తా. అధికారులంతా సర్దుకుని ఏపీకి వచ్చేయాలి.
(ఓటుకు నోటు కేసులో దొరికిపోయన తర్వాత)
6. నేను నిప్పుని. నా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు చోటు లేదు. అధికారులు నిజాయతీగా పనిచేయాలి. 
– అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌కి దేశంలోనే ప్రథమస్థానం. ఎన్‌సీఇఏఆర్‌ సర్వేలో వెల్లడి. 

7. రక్తం మరిగిపోతోంది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి
 –  ప్రత్యేక హోదా సంజీవని కాదు. ప్యాకేజీతోనే ఏపీకి మేలు    జరుగుతుంది.

8. 500, వెయ్యి నోట్లు రద్దు చేయమని నేనే ప్రధానికి లేఖ రాశా.
    – ఇంతటి సంక్షోభాన్ని నా జీవితంలో చూడలేదు. ఆగస్టు సంక్షోభాన్ని అవలీలగా ఎదుర్కొన్నా. ఎంత వెతికినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

9. ఏపీ పేద రాష్ట్రం. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో  మనల్ని సాగనంపారు. చెట్టు కింద కూర్చుని పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నా. 
– ప్రత్యేక విమాన ప్రయాణాలకు  30కోట్లు
హైదరాబాద్‌లో సీఎం కార్యాలయానికి (ఎల్‌ బ్లాక్‌) 14.63 కోట్లు
హైదరాబాద్‌లో సీఎం కార్యాలయానికి (హెచ్‌ బ్లాక్‌) 6.29 కోట్లు
లేక్‌ వ్యూగెస్ట్‌ హౌస్‌ 9.47 కోట్లు
సీఎం కార్యాలయానికి ఫర్నీచర్‌ 10 కోట్లు
ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ (విజయవాడ) 42 కోట్లు
మదీనగూడ ఫాంహౌస్, జూబ్లీ హిల్స్‌ ఇంటి అద్దెకు 4.37 కోట్లు
ప్రత్యేక బస్సు 5.50 కోట్లు
పార్క్‌ హయత్‌లో నివాసం(నెల అద్దె)  36.27 లక్షలు

10. రాష్ట్రం జీడీపీలో కేంద్రాన్ని మించిపోయింది. 12 శాతం వృద్ధి రేటు సాధించాం. రాబోయే కాలంలో ప్రపంచంలోనే ఏపీని అగ్రగామిగా నిలుపుతా. 
– మూడేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. 

–––– ఇంట్రో––––
 ఒక స్వార్థపరుడి అధికార దాహానికి మూడేళ్లు ఆవిరైపోయాయి. నాలుగొందల కోట్లతో చేసిన ఉగాది పండగ యుగాలకు తరగని వేదన నింపింది. పన్నెండేళ్ల గోదారమ్మ పుష్కర భాగ్యం 30 సమాధుల నిర్జీవ సాక్ష్యంగా మిగిలింది. అంతర్జాతీయ రాజధాని వెనుక అంతరంగం తెలిసొచ్చింది. హేమం పండిన పొలం బూడిద నిండి బావురుమంది. రుణ మాఫీపై తొలి సంతకమంటే ఐదేళ్లు రుణపడాలని అర్థం చెప్పింది. గోదారమ్మ నయగారం ఆక్వా శక్తులకు బలిదానం కావడం తప్ప మరో దారి లేకుంది. నయ వంచకుడి నరనరాన జీర్ణించుకున్న దోపిడీ నూతన వసంతాలను చీకటి మయం చేస్తోంది. 
========================
జనవరి నెల
========================
 జనవరి 11న విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల ఒప్పందాలు కుదరుతున్నట్లు ప్రకటించారు. గతంలో ప్రకటించిన పెట్టుబడుల్నే కొన్ని కొత్తవిగా చూపించారు. జనవరి 12న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వాతి అనే అగ్రికల్చర్‌ విద్యార్థిని యువకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయ శాఖలో ఎంపీఈవో పోస్టు ఇంటర్వ్యూకు వెళ్లగా గోకవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను వేధించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారణ. డిసెంబర్‌ 15న ప.గో జిల్లా కోవ్వూరు వద్ద  గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జనవరి 13న జూన్‌ నుంచి వెలగపూడిలో శాశ్వత రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటించారు. 
అనంతపురం న గరంలోని శ్రీనివాసనగర్‌లో మంజుల ఆత్మహత్యలో మరో కోణం వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరోకరితో పంచుకున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఇద్దరు స్నేహితులకు తార్చాడు. తట్టుకోలô ని పరిస్థితుల్లో గొడవ పడిన మంజుల అనుమానస్పద స్థితిలో శవంగా మారింది. జనవరి 17న విమానాశ్రయ మేనేజర్‌పై చేయి చేసుకున్నారంటూ ఎంపీ మిథున్‌రెడ్డిని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు, 14 రోజుల రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపు. జనవరి 24న సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన. దాహోస్‌ పర్యటన జీవోలో సింగపూర్‌ పర్యటన గురించి ప్రస్తావనే లేదు. ఇప్పటికే 99 ఏళ్ల లీజు, ఫ్రీ హోల్డ్‌పై చట్టసవరణ. లోకేష్‌ విదేశీ విహారాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌. ఒక చేతిలో మగువ మరో చేతిలో మందు గ్లాస్‌లో చినబాబు. విదేశీ వనితతో ఆటపాటలు. విదేశీ భామలతో స్విమ్మింగ్‌ఫూల్‌లో సయ్యటలు. జనవరి 25న రైతులపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు .రూ.లక్షన్నర రుణాన్ని మాఫీ చేశాం. అంతకుమించి రైతులకు అత్యాశ పనికిరాదు. మా భూమి ఇక్కడే ఉంది..ఇక్కడే ఉంటామంటే ఎలా? జనవరి 25: ఆరోగ్యమిత్రలపై సర్కార్‌ జులుం
ఉద్యోగం కోసం రోడ్డెక్కిన ఆరోగ్యమిత్రలపై పోలీసుమార్కు అణచివేత. బెజవాడలో 1000 మంది ఆరోగ్య మిత్రల నిర్బంధం. జనవరి 28న హైదరాబాద్‌లోనే ఉంటానని గ్రేటర్‌ ప్రచారంలో కేసీఆర్‌కు సవాల్‌ విసిరిన  టీడీపీ అధినేత. జనవరి 28న అమరావతి సాక్షిగా కృష్ణమ్మ కబ్బా
బాబుల కోసం రాజధానిలో కృష్ణానది కరకట్టలో మార్పులు, నదిలోకి జరిపి కట్టాలని ప్రతిపాదనలు..సీఎం చంద్రబాబు ఇంటికోసం నదిలో అక్రమ కట్టడాలు. జనవరి 31న ఉవ్వెత్తున ఎగిసిన కాపు రిజర్వేషన్‌ ఉద్యమం. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారుల నిప్పు. రెండు పోలీసు స్టేషన్లు దగ్ధం
========================

ఫిబ్రవరి నెల
========================
తుని రైలు ఘటనను ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీ, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌పైకి నెట్టేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు. కాపు జేఏసీలో చీలికలు తెచ్చి ముద్రగడ సహా 27 మందిపై కేసులు బనాయించిన సర్కారు. ఫిబ్రవరి 6న అంగన్‌వాడీల వేతనాలపై చంద్రబాబు మాటమార్చాడు. పెంచిన వేతనాలు 2016 ఏప్రిల్‌ నుంచి అమలుకు ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే గతంలో 2015 సెప్టెంబర్‌ 1 నుంచి ఇస్తామని ప్రకటించి మాట తప్పారు. 97 వేల మంది మహిళలకు రూ.140 కోట్లు ఎగవేతకు ఈ పన్నాగం. రాజధానికి భూములివ్వలేదని అరటి తోట ధ్వంసం. ఫిబ్రవరి 8న ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. కానిస్టేబుల్‌ను చితకబాదాడు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో దారుణం చోటుచేసుకుంది. సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంపు. అక్షరాల రూ.6 వేల కోట్లు లూటీ చేసే స్కీమ్‌. చినబాబు కనుసన్నల్లో దందా. పోలవరం పేరుతో జరుగుతున్న అక్రమాలను సహించని ఇద్దరు సీఎస్‌లు. సంతకం పెట్టేందుకు నిరాకరించిన సత్యప్రకాశ్‌ టక్కర్‌. ఫిబ్రవరి 16న అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య. అనంతలో ఇద్దరు, వైయస్‌ఆర్‌ జిల్లాలో ఒకరు. ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన. వెలగపూడిలో భూమి పూజ చేసిన సీఎం. జూన్‌ 15లోగా నిర్మాణం పూర్తి చేసి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తామని ప్రకటన. ఫిబ్రవరి 20న నా చేతికి వాచీ లేదు. వేలుకు ఉంగరం కూడా లేదు. రాజకీయాల్లో సంపాదించే యోచన లేదని బాబు ప్రకటన. ఫిబ్రవరి20న విజయవాడలోని డాక్టర్‌ కేకేఆర్‌ హ్యాపీ వ్యాలీ స్కూల్‌ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ టీచర్లపై నోరు జారిన బాబు. మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని విమర్శ. చదివిన చదువు మరిచిపోతున్నారని ఎద్దేవా. ఫిబ్రవరి20న కేంద్ర మంత్రి సుజనాకు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు. మార్చి 5న వ్యక్తిగత హాజరుకు ఆదేశం. రూ.106 కోట్ల మేర మోసం చేశారంటూ మారిషన్‌ కమర్షియల్‌ బ్యాంకు దాఖలు చేసిన క్రిమినల్‌ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు. ఫిబ్రవరి 22న టీడీపీలో చేరిన వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్‌ఖాన్, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి. ఒక్కొక్కరికి 20 నుంచి 40 కోట్లు వెచ్చించి కొనుగోలు. ఫిబ్రవరి23న మరోసారి రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్‌. ఈసారి ఇరిగేషన్‌ అధికారిపై దాడి.. కాలర్‌ పట్టుకొని ఈడ్చివేసి జులుం. 
ఫిబ్రవరి 26న అగ్రిగోల్డ్‌ కుంభకోణం తెరపైకి. 14.81 ఎకరాలను కొట్టేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. సీఆర్‌డీఏ పరిధిలో 166 ఎకరాలను సొంతం చేసుకున్న కేంద్ర మంత్రి. హాయ్‌ల్యాండ్‌ దక్కించుకున్న మరో ప్రభుత్వ కీలక నేత. యాజమాన్యంతో కుమ్మక్కై భూములు కొల్లగొట్టిన ప్రజాప్రతినిధులు. ఫిబ్రవరి 27న హైదరాబాద్‌ నా బ్రెయిన్‌ చైల్డ్‌ అని బడాయి పోయిన బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ ఇస్తున్నానని ఎన్‌డీ టీవీకి  చంద్రబాబు. ఫిబ్రవరి28న టీడీపీలో చేరిన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు. 
================

మార్చి  నెల
========================
రాజధాని భూసేకరణ పేరుతో 25వేల ఎకరాలు బాబు బినామీలు కైంకర్యం. పైగా భూములు కొంటే తప్పేంటని చంద్రబాబు వితండవాదన. హైదరాబాద్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముస్లిం మహిళను చేయి పట్టి కారులోకి లాగబోయి తన్నులు తిన్న మంత్రి రావెల తనయుడు. మంత్రి గంటా శ్రీనివాసరావుపై తుంపాల షుగర్‌ ఫ్యాక్టరీ కేసుల ఎత్తివేత. రైతులపై మాత్రం కొనసాగుతున్న కేసులు. నీరు– చెట్టు పేరుతో తెలుగు తమ్ముళ్ల దోపిడీ. 25:75 లెక్కన కమీషన్లు. మార్చి 9న విపక్షం సస్పెన్షన్‌. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ఒక్క రోజు సస్పెన్షన్‌ విధించిన స్పీకర్‌. టీడీపీ నేతలు న న్ను కొనాలనుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర సంచలన ప్రకటన. రూ.30 కోట్లు ఇస్తామని ఆశ చూపారని వెల్లడి. మార్చి 14న కోరలు తీస్తా..ఖబడ్డార్‌.., అంటూ సభలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పై చంద్రబాబు అసహనం. మగాడివైతే దమ్ముంటే, సిగ్గులేదు..అంటూ ప్రతిపక్ష సభ్యులపై
సీఎం, మంత్రుల బూతు పురాణం. ప్రతిపక్షంపై వేలెత్తి చూపించిన చంద్రబాబు. మార్చి 15న ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదని మంత్రి నారాయణ ప్రకటన. శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పామన్న మంత్రి. మార్చి 20న ఏకపక్ష సభ. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ. మార్చి 28న  జిల్లాల్లో సీఎం సభలు, పర్యటనల కోసం రూ.38 కోట్లు. పుష్కరాల ప్రచారానికి రూ.50 కోట్లు
మార్చి 30న ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌కు ససేమిరా అన్న అధికార పక్షం. మళ్లీ మూజువాణి మంత్రమే. ఫిరాయింపు ఎమెల్యేలను కాపాడుకునే  తాపత్రయం. 
==================
ఏప్రిల్‌
========================
ఏప్రిల్‌1న కరెంట్‌ షాక్‌. ఏప్రిల్‌2: రాజధానికి 33,000 ఎకరాలు అటవీ భూమి కావాలని కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయం. కృష్టా, గుంటూరులో అటవీ భూమిని రాజధాని అవసరాల కోసం సీఆర్‌డీఏకి బదలాయించాలని విన్నపం. ఏప్రిల్‌2: పోలవరం ఇసుక సాంధ్రీకరణపై సర్కార్‌ రాజీ. డ్యామ్‌ ప్రాంతంలో 100 శాతం ఇసుక సాంద్రీకరణ అవసరం కాగా 80 శాతానికి మించి చేయలేమన్న ఎల్‌ అండ్‌ టీ. అది ప్రాజెక్ట్‌కు ముప్పు అంటున్న నిపుణులు. రాజధానికి హడ్కో నుంచి మూడేళ్లలో రూ.7500 కోట్లు రుణం. ఏప్రిల్‌7న కేంద్ర మంత్రి సుజనాకు అరెస్టు వారెంట్‌. 104 వాహనాలపై చంద్రబాబు ఫోటోలు. గత రెండేళ్ల ఖర్చుల వివరాలు పంపమని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖకు నీతి ఆయోగ్‌ లేఖ. అభివృద్ధి, అభివృద్ధేతర, రెవెన్యూ ఖర్చులు చెప్పమని ఆదేశం. ఏప్రిల్‌15న దేవాదాయ చట్టానికి 11 సవరణలు. కౌలు మొత్తం పెంపు..కాలపరిమితి తగ్గింపు.
ఏప్రిల్‌19న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాదన్న రాష్ట్ర ప్రభుత్వం. వేతనం నెలకు రూ.2500 మాత్రమే పెంపు. ఏప్రిల్‌ 22న జీఎంఆర్‌కు కాకినాడ సెజ్‌ భూములపై సర్వహక్కులు ఇచ్చేదుకు సీఎం యత్నం. 1589 ఎకరాలు ఎస్‌ఈజెడ్‌ నుంచి డీ నోటిపై చేసిన ఏపీఐఐసీ. గుంటూరులో టీడీపీ ఆక్రమణలో ప్రభుత్వ స్థలం. కార్యాలయ నిర్మాణం. లీజు వెయ్యి గజాలు.. ఆక్రమణ 1637 గజాలు. 1999 సంవత్సరం నుంచి పైసా కూడా చెల్లించని వైనం. ఏప్రిల్‌29న హోదా లేదని స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి. పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. రాజ్యసభలో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చ. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కును అడ్డుకుంటున్నారని మగవాళ్లను నిర్బంధించి.. మహిళలపై దాడి. పశ్చిమ గోదావరిలో భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యే మాధవ నాయుడు అనుచరులు.
===============
మే నెల
========================
మే2న బెజవాడ ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టడంతో శిశువు మృతి. 
మే8న ప్రభుత్వ చలివేంద్రాలకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి మజ్జిగ కొనుగోలుకు జీవో జారీ. 13 జిల్లాలకు రూ.39 కోట్లు కేటాయింపు. మే11న పనామా లీకుల్లో హెరిటేజ్‌. అనుమానాస్పద కంపెనీలతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌కు ఉన్న లింకుల్ని వెల్లడించిన పనామా పేపర్స్‌. ప్రసాద్‌కు పలు దేశాల్లో కంపెనీలు.మే17: హోదాతో ఏం వస్తుంది?. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. 
మే17: నగ్న చిత్రాలతో టీడీపీ ఎంపీ అనుచరుల బెదిరింపులు. ఎంపీ తోట నర్సింహం సహా మరో అరుగురి అరెస్టుకు ఆదేశాలు. 
మే 23న మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని. అటవీశాఖ ఏసీఎఫ్‌కు ఫోన్‌ బెదిరింపులు. కొల్లేరు అభయారణ్యంలో అనుమతుల్లేకుండా రోడ్డు నిర్మాణం. వెయ్యి కోట్లు విలువైన తమిళనాడులోని సదావర్తి సత్రం భూములు స్వాహా. వెయ్యి కోట్ల విలువైన భూమి వేలంలో రూ.27 లక్షలకే కైవసం. తెర వెనుకు లోకేష్, మంత్రులు. 
మే29న చంద్రబాబు ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’ భాషకు ఏడాది. 
========================
జూన్‌ నెల
========================
జూన్‌1: జెన్‌కో బోర్డును ఏమార్చిన ప్రభుత్వాధినేత. సోలార్‌ టెండర్ల కుంభకోణం వెనుక ప్రభుత్వ పాత్రను తెరమీరకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తపడింది. టెండర్ల వ్యవహారంలో అవకతవకలు ఉన్నాయి ఏకవాక్యంతో అధికారులు పంపించిన లేఖ.
జూన్‌ 2: నవ నిర్మాణ దీక్ష పేరిట చంద్రబాబు మార్కు మాయాజాలం. రెండేళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వారం రోజుల పాటు దొంగదీక్షలు. కేంద్రం నిధులతో చంద్రన్న సోకులు. పైసా ఖర్చు చేయకుండానే పేరు కోసం పాకులాట. 
జూన్‌ 3: బాబూ.. కోట్లు ఇస్తేనే పదవి ఇస్తారా? డబ్బిచ్చినోళ్లనే రాజ్యసభకు పంపి బీసీలకు అన్యాయం చేస్తారా చంద్రబాబు అని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ మండిపాటు. కర్నూలులో బీసీ సంఘాల నేతలతో కలిసి జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట కేఈ ప్రభాకర్‌ ధర్నా.
జూన్‌ 5: తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగింది. నా ప్రేరణతోనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవో అయ్యారు. అమరావతిలో జరిగిన నవనిర్మాణ వారోత్సవాల్లో చంద్రబాబు మాట్లాడిన మతిభ్రమించిన మాటలు.
జూన్‌ 9: విశాఖలో రూ. 100 కోట్లు విలువైన ఎన్‌ఎండీసీ భూమికి చినబాబు ఎసరు. రాష్ట్ర ప్రజల భూములను బెదిరించి లాక్కున్న చంద్రబాబు ఆఖరికి కేంద్ర ప్రభుత్వ భూములు (ఎన్‌ఎండీసీ)ని కూడా వదలడం లేదు. రూ. 100 కోట్ల విలువైన భూమిని చినబాబు లోకేష్‌ మిత్రునికి చెందిన ఇంటర్‌ గ్లోబ్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. 
జూన్‌ 10: ముద్రగడ దీక్షపై చంద్రబాబు దాడి. గ్రామాల్లో కాపుకులస్థులు ముద్రగడ దీక్షకు తరలిరాకుండా ఆంక్షలు విదించారు. చంద్రబాబు నియంతృత్వధోరణిని చూపిస్తున్న సాక్షిపై కన్నె్రర. ప్రసారాలు నిలిపివేత. 
జూన్‌ 12: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని అక్రమ దందా. గుంటూరు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల్ని కొల్లగొడుతున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని. సర్కార్‌ ఖాజానాకు రూ. కోట్లు గండి కొడుతున్నాడని హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం. 
జూన్‌ 16: వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని టీడీపీలో చేరాలంటూ రూ. 30 కోట్లకు బేరం కుదుర్చుకున్న చంద్రబాబు. మంత్రి పదవి ఇస్తానని ఎర. 
జూన్‌ 17: ముద్ర ఆరోగ్యంతో చంద్రబాబు సర్కార్‌ ఆటలు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ ఆసుపత్రిలో దీక్ష చేశారు. ఆరోగ్యం మరింత విషమిస్తున్నా సర్కార్‌ మాత్రం పట్టించుకోలేదు. 
జూన్‌: స్విస్‌ ఛాలెంజ్‌ విధానంతో రాజధానిని నిర్మించేందుకు సింగపూర్‌ కంపెనీలకు అప్పగించారు. ఉన్నతాధికారులకు ముందుగా పంపించకుండా ప్రతిపాదనలపై ముందు చంద్రబాబే సంతకం పెట్టి వారికి పంపించారు. దీంతో అధికారులు తీవ్ర అసంసృత్తి వ్యక్తం చేశారు. 
జూన్‌ 21: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎన్నికల్లో తాను పెట్టిన ఖర్చుపై సంచలన ప్రకటనలు చేశారు. మొన్న ఎన్నికల్లో రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయం రూ. 28 లక్షలు మించరాదని ఈసీ వెల్లడించినా కోడెల వాటిని ఉల్లంఘించారు. 
జూన్‌ 22: తెలుగుదేశం పార్టీకి విధేయులైన అధికారులనే నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో వెల్లడి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించే అధికారులు కావాలని మంత్రులకు సూచన. మాట వినని అధికారులను వెయిటింగ్‌లో పెట్టాలని కుట్రపూరిత వ్యాఖ్యలు. 
జూన్‌ 24: సాగునీటిలో చంద్రబాబు అవినీతి సునామీ. పెదబాబు డైరెక్షన్, చినబాబు నాయకత్వంలో కాంట్రాక్టర్ల ముసుగులో నాలుగు ప్రాజెక్టుల నిధులను లూటీ చేశారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు ఇచ్చుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. సుమారు రూ. 748 కోట్లు దండుకున్నారు. 
జూన్‌ 25: ఏపీ రాజధానిని మనవాళ్లు కడితే అవి మురికివాడలు అవుతాయని చంద్రబాబు నాయుడు దేశ ఇంజనీర్లను కించపరిచే విధంగా మాట్లాడారు. మనదేశంలోని ఒక్క కంపెనీకైనా ఒక్క సిటీ కట్టిన అనుభవమైనా ఉందా అని కుట్రపూరిత వ్యాఖ్యలు. ప్రశ్నలు అడిగిన విలేకరులపై మాటలతో ఎదురుదాడి. 
జూన్‌ 26: రాజధాని కోసం భూములివ్వని రైతులను ఎవరూ కాపాడలేరని చంద్రబాబు రైతులపై ఎదురుదాడి. పూలింగ్‌కు ఇవ్వని రైతుల భూముల్ని తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రైతులకు ఇన్సెంటివ్‌లు ఉండవని బెదిరించారు. 
==================
జూలై నెల
========================
జూలై 1న దేవుళ్లపై దండయాత్ర. విజయవాడలో 30 ఆలయాల కూల్చివేత. 2న అవినీతిలో ఏపీని నంబర్‌ 1గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఏఈఆర్‌ సర్వే నివేదికలో వెల్లడి. అవినీతి ఉందన్న 74.3 శాతం మంది ప్రజలు. 3న నగరి చైర్‌ పర్సన్‌ శాంతకుమారిపై టీడీపీ నేతల దాడి. పోలీసుల ఎదుటే టీడీపీ కార్యకర్తల గూండాగిరి.
రంజాన్‌ తోఫా కార్యక్రమానికి మీరెందుకు వచ్చారంటూ దూషణలు. ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వెళ్లిన శాంతకుమారిపై విచక్షణారహితంగా దాడి. 
అమరావతిలో స్టార్టప్‌ ఏరియా పేరుతో భారీ దందా. సీడ్‌ కాపిటల్‌లో సింగపూర్‌ కంపెనీలకు 1,691 ఎకరాలు అప్పగింత. ప్రపంచబ్యాంకు ర్యాంకు కోసం తెలంగాణ దరఖాస్తు కాపీ. ఏపీ సర్కార్‌ తీరుపై తెలంగాణ సీరియస్‌. నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం. వైయస్‌ఆర్‌సీపీS యువనేతకు చెందిన కేబుల్‌ కార్యాలయంపై దాడి. 11న సీఎం నోటి మాట మీదే సోమా కన్‌ స్ట్రక్షన్‌ కు రూ.86 కోట్ల పుష్కర ఘాట్‌ పనులు. జూలైన 15న దేశీ ఇంజినీర్లపై చంద్రబాబు వివాదాస్పద ఆరోపణలు. 
మన వాళ్లతో కూర్చుంటే మరో మురికివాడ కడతారని ఎద్దేవా. అంతర్జాతీయ నగరం కోసమే రష్యా పర్యటన చేశానని వెల్లడి. హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసేటప్పుడు అమెరికా నలువైపులా తిరిగానని సొంత డబ్బా. 16న స్విస్‌ చాలెంజ్‌ లో పారదర్శకత లేదన్న సుప్రీం. స్విస్‌ చాలెంజ్‌ నిబంధనలకు తూట్లు. ముఖ్యమంత్రి, మంత్రి కనుసన్నల్లో వెలిగొండ ప్రాజెక్టు. కాంట్రాక్టర్లకు అదనంగా రూ.68.44 కోట్లు
ఈపీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనం లూటీ. 18న సీఆర్డీఏ ప్రకటన వెబ్‌ సైట్‌ నుంచి తొలగింపు. 30 నిమిషాల్లో మాయం. వేలంలో వచ్చిన 22 కోట్ల కన్నా రూ.5కోట్లు ఎక్కువిస్తే సదావర్తి భూములు వారికే ఇచ్చేస్తామని ప్రకటన. 
21న టాటా, బీజీఆర్‌ కంపెనీలకు  2,392 కోట్ల ప్రజాధనం లూఠీ. థర్మల్‌ సాక్షిగా నంబర్‌ వన్‌ దోపిడీ. జూలై 30న విజయవాడలో అర్థరాత్రి వేళ సర్కారు కక్షసాధింపు చర్య. మహానేత విగ్రహం తొలగింపు.
========================
ఆగష్టు నెల
========================
ఆగస్టు 2న ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ బంద్‌ సంపూర్ణం. స్తంభించిన ఆంధ్రావని. తిరుపతిలో పోలీసుల దాష్టీకం. మహిళల పుస్తెలు తెంచి, చీరలు చింపిన ఖాకీలు. 5న మరోసారి గాంధీ హత్య. ఇబ్రహీంపట్నంలో మహాత్ముని విగ్రహానికి అవమానం. మొన్న ఆలయాలు, నిన్న  వైయస్‌ఆర్, నేడు గాంధీ విగ్రహాల తొలగింపు. 
కోటీశ్వర మంత్రుల్లో నారాయణ దేశంలోనే టాప్‌. ఆస్తుల సగటులోనూ ఏపీ మంత్రులదే  మొదటి స్థానం. 7న నారావారిపల్లెలో వైయస్సార్సీపీ పక్షాన నిలిచారని ముగ్గురు యువకులపై కేసు నమోదు. చంద్రబాబు ఊళ్లో ఆగడాలకు హైకోర్టు బ్రేక్‌. 
8న ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతికి ఐదు పేజీల విన్నపం ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌. ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం జోక్యం చేసుకోవాలని విన్నపం. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని విజ్ఙప్తి. 
9. వామపక్ష నేతలతో వైయస్‌ జగన్‌ భేటీ. హోదా సహా పలు అంశాలపై చర్చ..మద్దతు కోసం వినతి. 10న ప్రత్యేక హోదా కోసం రిషికేష్‌ లో వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు. గంగాస్నానం, యాగం. సదావర్తి అక్రమాలపై దేవాదాయ శాఖకు ఆర్జేసీ నివేదిక. వేలం నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు సత్రం ఈవో తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం. రూ. వేయి కోట్ల విలువైన 83.11 ఎకరాలను రూ.22.44 కోట్లకే కొల్లగొట్టేశారని నివేదిక. సత్రం నివేదిక ఎలా బయటకొచ్చిందని దేవాదయ శాఖ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం. 12న మైనర్‌ దళిత బాలుడిని చెట్టుకు కట్టేసి చెప్పులు, క్రరలతో కొట్టారు. వైయస్‌ జగన్‌ కు గోడు వెళ్లబోసుకున్న సూదాపాలెం బాధితులు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ. దళితులపై దాడులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌. 13న పుష్కరాలను ఈవెంట్‌ గా మార్చిన బాబు. పుష్కర పనుల్లో కోట్ల రూపాయలు అవినీతి. కృష్ణాతో గోదావరి నదీజలాల అనుసంధానం పేరిట బూట్లు ధరించి పూజలు. జగన్‌ ఇంటి గేటు వద్దకు వచ్చి కుళ్లు రాజకీయం (రావెల, శ్రవణ్‌ కుమార్‌). 16న కృష్ణమ్మను చెరబట్టిన ఇసుకాసురులు. ఐదు నిండు జీవితాలను మింగేసిన ఇసుక గుంతలు
పుష్కరస్నానానికి వచ్చిన విద్యార్థుల మృత్యువాత. చింతలపూడి ఎత్తిపోతల పథకం తొలిదశ పెంపు పనుల అంచనా రూ. 906 కోట్లకు పెంపు. యుద్ధప్రాతిపదినక సీఎం ఆమోదం. 17న కూలీలకు ఇచ్చే డబ్బుల్లోనూ కక్కుర్తి. తాత్కాలిక పనుల్లో తమ్ముళ్ల దందా. ఒక్కో కూలీ నుంచి రోజుకు రూ.50 చొప్పున స్వాహా. మూడు నెలల్లో కోటి రూ. హాంఫట్‌. రెండు నెలలుగా కాలీలకు జీతాలు ఇవ్వని వైనం. సీఆర్డీఏ కార్యాలయం ఎదుట కూలీల ధర్నా. 22న వాటాల కోసం గూండాగిరి. కోడెల పెదబాబు దాష్టీకం. రైల్వేకూలీలు, ఉద్యోగులపై అనుచరుల దాడి. షెడ్‌ లు పీకేసి దౌర్జన్యం..మూడు లారీలు, రైల్వే ఉద్యోగి కారు ధ్వంసం. డ్రైవర్, సూపర్‌ వైజర్‌ ల కిడ్నాప్‌. పర్సంటేజీ ఇవ్వకపోతే తగలబెడాతమని బెదిరింపులు. 23న మంత్రి అచ్చెన్నాయుడికి నయూంతో సంబంధాలున్నాయని బాంబు పేల్చిన నిర్మాత నట్టికుమార్‌. స్విస్‌ చాలెంజ్‌ లో లోగుట్టుపై హైకోర్టు ఆక్షేపణ. 28న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. వరుడిని నమ్మారు, నన్ను నమ్మలేదు. అందుకే ఈ కరువు అనంతపురం, చిత్తూరులో బాబు.  
========================
సెప్టెంబర్‌ నెల
========================
1న ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ఆపాలని హైకోర్టులో చంద్రబాబు అత్యవసర పిిటిషన్‌. 3న కడప కలెక్టరేట్‌ వద్ద  వైయస్‌ జగన్‌ రైతు మహాధర్నా. శ్రీశైలం రిజర్వాయర్‌ను ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ గా పరిగణించాలి. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీరందిస్తూ తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్‌. 6న ప్రతిపక్షంపై తుని రైలును ప్రయోగించిన చంద్రబాబు. తుని కేసులో భూమనను 6 గంటల పాటు విచారించిన సీఐడీ. కక్షపూరిత రాజకీయాల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు. 7న తేదీ అర్థరాత్రి, ప్రత్యేకహోదా కుదరదని తేల్చేసిన కేంద్రం. విభజన చట్టహామీలనే వల్లె వేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ. అర్థరాత్రి ప్రెస్‌ మీట్‌ పెట్టి కేంద్రంం వైఖరిని సమర్థించిన బాబు. అదే రోజున స్వాగతిస్తున్నా అంటూ చంద్రబాబు మీడియా సమావేశం. ఏపీకి కేంద్రం ఇచ్చిన దానికి అభినందిస్తున్నానని కితాబు. హోదా సాధ్యం కాదంటున్నారు ఎంతివ్వాలో అంతివ్వండి అని కాలు మొక్కిన సీఎం. 9న ఏపీ బంద్‌ కు వైయస్‌ జగన్‌ పిలుపు. 10న హోదా వస్తే ఏమొస్తుందని మండలిలో చంద్రబాబు వ్యాఖ్య
నాతెలివి చూసే అధికారమిచ్చారని ఆత్మస్తుతి. వారంలో సీమ కరువు తీర్చానని ప్రకటన. 13న 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని ప్రకటన. 17న ఆ వేడిలో హోదా అన్నా అని వెంకయ్య వివరణ. ఇప్పుడు ప్యాకేజీకి మించి మార్గం లేదని బాబుకు చెప్పానని సూచన. 19న హోదాతో ప్యాకేజీ సమానం. అందుకే ఒప్పుకున్నా.
రెండేళ్లలో ఎన్నికలు..తీసుకోకుంటే ఎలా? అని చంద్రబాబు వివరణ. 
22న ఏలూరులో యువభేరి సదస్సు. హోదా సంజీవని అని మేనిఫెస్టోలో పెట్టారు
ప్రజలతో అవసరం తీరాక ప్లేటు మార్చేశారు. బాబుపై వైయస్‌ జగన్‌ మండిపాటు. 
సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఐదుకోట్ల మంది ఓ లెక్కా?
ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినా అరెస్ట్‌ కాని ఏకైక సీఎం బాబే
పోరాడి హోదాను సాధించుకుందామని పిలుపు. 24న కేంద్రం కంటే తెలివైన వాడిని నేనే. అందుకే ప్యాకేజీని అంగీకరించా. డబ్బు లేకుంటేనే ఎన్నో చేశా..డబ్బుంటే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేస్తా. కేంద్రం చేయలేకే పోలవరం నాకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. దోమలపై దండయాత్రలో బాబు వ్యాఖ్యలు. 
26న గుంటూరులో బాధిత రైతులకు పరామర్శ.  
సీఎం ఆకాశంలో చక్కర్లు కొడితే రైతుల కష్టాలు తెలుస్తాయా?
బాబు నేలకు దిగిరా. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌. హోదా అంటే జైలుకే. 
విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్‌. జగన్‌ సభలకు వెళ్లొద్దని హుకుం. 
హోదాతో ఒరిగిందేమిటి. బాపట్లలో కార్యకర్తల సమావేశంలో బాబు
27న గుంటూరు జిల్లాలో వరద బాధితులకు పరామర్శ
ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. రైతులకు రుణాలివ్వొద్దని బ్యాంకులకు చెబుతారా?. తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సిన దీనస్థితిలో రైతులు
లక్షల ఎకరాల్లో పంటనష్టం ...ఊరంతా వరద. హెలికాప్టర్‌ దిగి ఊరును చూడని సీఎం. టీవీల్లో కనిపించాలన్నదే తప్ప రైతుల కష్టాలు పట్టవు
నా పర్యటనతోనైనా కదలిక వస్తుందని తిరుగుతున్నా. వైయస్‌ జగన్‌ ఆగ్రహం. 

ఫొటో: 7న తేదీ అర్థరాత్రి, ప్రత్యేకహోదా కుదరదని తేల్చేసిన కేంద్రం. రాష్ట్ర బంద్‌కు వైయస్‌ జగన్‌ పిలుపు. 
.......................................
అక్టోబర్‌ నెల
========================
1న భూసేకరణ, హోదాపై గొంతెత్తితే పీడీ యాక్ట్‌ పెట్టండి. కలెక్టర్లు, ఎస్పీలకు బాబు ఆదేశాలు. 2న మరుగుదొడ్డి లేకుంటే పోటీకి అనర్హులే. 2018 అక్టోబర్‌ 2 నాటాకి ఓడీఎఫ్‌ ప్రాంతంగా ఏపీ. తిరుపతిలో స్వచ్ఛ ఏపీ సభలో బాబు వ్యాఖ్యలు. 4న 
సర్కార్‌ అవినీతి లో కొట్టుకుపోయిన పుష్కర ఘాట్లు, రోడ్లు
వేసిన రోడ్లు గుంతలమయం, కొన్ని చోట్ల రోడ్లే మాయం
ప్రతి పనిలోనూ స్థానిక పచ్చనేతలకు కమీషన్లు. 
పుష్కరాలు జరిగింది 135 గ్రామాలు ఒక నగర ప్రాంతంలోనే
లోటు బడ్జెట్‌ లోనూ రూ.1472.39 కోట్లు
సరాసరి ఊరికి 11కోట్లు. అక్టోబర్‌4న అనంతలో రైతు మహాధర్నా. 
5న జగన్‌ కు జమ్మలమడుగులో బ్రహ్మరథం. ముద్దనూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం. ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల్లో వైయస్‌ జగన్‌
ఏసీసీ బాధిత రైతులకు అండగా ఉంటానని భరోసా. 6న రైతులకు అన్యాయం చేయొద్దు. అర్హులందరికీ సబ్సిడీ విత్తనాలివ్వాలి. కడప పెండ్లిమ్రరి వద్ద రైతులతో జగన్‌. 7న క్రమశిక్షణ కార్యక్రమాల్లో నిమ్మకాయల రాజప్పను నిలబెట్టి నిలదీసిన లోకేష్‌. చినబాబుపై సర్వత్రా విమర్శలు. 12న నల్లధనాన్ని నిరోధించాలి. దీనిపై ప్రధానికి లేఖ రాస్తున్నా. మా వాళ్లు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటున్నారు
వెలగపూడిలో చంద్రబాబు వ్యాఖ్యలు. 13న ఆ పదివేల కోట్లు ప్రకటించింది బాబు బినామీనేమో. ప్రధానికి లేఖ రాసిన ప్రతిపక్ష నేత. ఐడీఎస్‌ 2016 జాబితాను బయటపెట్టాలని వినతి. 16న రాజధాని గ్రామాల్లో అవినీతి సెంటు.  సీఆర్డీఏ రికార్డులు తారుమారు చేసి రైతుల భూములు అధికారుల పేరిట రిజిస్ట్రేషన్‌. 18న సదావర్తిపై సర్కార్‌ వెనుకడుగు. సేల్‌ సర్టిఫికెట్‌ జారీ చేయబోమని హైకోర్టుకు హామీ
హోదా కోరితే 12 మంది వైయస్
Back to Top